Mango Paneer Dosa: ఇలాంటి దోశ జీవితంలో తినుండరు..! మ్యాంగో-పన్నీర్ దోశ.. టేస్టే వేరప్ప..!
రోజు రోజుకీ వింత వింత వంటకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని రకాల ప్రయోగాలు భోజన ప్రియులను ఆకర్షిస్తూ తినాలి అనిపించేలా ఉంటాయి. కొన్ని ప్రయోగాలు మాత్రం వద్దు బాబోయ్.. అనిపించేలా ఉంటాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి దోశలు వేస్తున్నాడు. అదికూడా మ్యాంగో-పన్నీర్ కాంబినేషన్‌లో. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా బాగానే ఉందనిపించినా తినడానికి కాస్తా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరు మరి. ఇతను పెనంపైన దోశ పిండి వేసి దానిమీద మ్యాంగో జ్యూస్ వేశాడు. అంతటితో ఆగకుండా దానిపైన పన్నీర్ తురుము కూడా వేశాడు. ఆ తర్వాత దోశను నిలువుగా కట్ చేసి రోల్స్ లాగా చుట్టి, మ్యాంగోజ్యూస్‌నే చట్నీగా సర్వ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ దోశ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు దోశ చూడ్డానికి కలర్‌ఫుల్‌గానే ఉంది.. కానీ తింటే ఏమవుతుందో దేవుడికే తెలియాలి అంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

