Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai: గాలి వానలో తుపానులో 200 కి.మీ ప్రయాణించి రెండేళ్ల చిన్నారికి ప్రాణం పోసిన వ్యక్తి.!

Chennai: గాలి వానలో తుపానులో 200 కి.మీ ప్రయాణించి రెండేళ్ల చిన్నారికి ప్రాణం పోసిన వ్యక్తి.!

Anil kumar poka

|

Updated on: Dec 10, 2023 | 10:29 AM

ఇటీవల మిచౌంగ్‌ తుపాను తమిళనాడును అతలాకుతలం చేసిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూర్‌కు చెందిన 40 ఏళ్ల మునుస్వామి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మునుసామి.. క్యాన్సర్‌తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలుల్ని భారీ వర్షాన్ని లెక్కచేయక 200 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ఎంతో విలువైన మందును అందజేశారు.

ఇటీవల మిచౌంగ్‌ తుపాను తమిళనాడును అతలాకుతలం చేసిన సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూర్‌కు చెందిన 40 ఏళ్ల మునుస్వామి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మునుసామి.. క్యాన్సర్‌తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలుల్ని భారీ వర్షాన్ని లెక్కచేయక 200 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ఎంతో విలువైన మందును అందజేశారు. స్టెమ్ సెల్ ఎన్జీవో డెట్రాయ్‌లో పని చేస్తున్న తనకు ఔషదం చేర్చడం ఎంత ముఖ్యమో తెలుసుననీ ఆయన అన్నారు. చెన్నైలో క్యాన్సర్‌ బాధిత రెండేళ్ల శిశువుకు ఎముక మజ్జను దానం చేయడానికి అండమాన్ నుండి ఓ దాత వచ్చారు. ఆయన చెన్నైలోని పాత పెరుంగులత్తూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నారు. అతడికి గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్‌ను అందించడానికి మునుస్వామి తుపాను సమయంలో రిస్క్‌ చేశారు.

ఎందుకంటే రక్త కణాలను వెలికితీసేందుకు, ఐదు రోజుల పాటు దాతకు గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చేటప్పుడు గ్యాప్ ఉండకూడదు. అప్పుడే బాధిత శిశువుకు అవసరమైన మూలకణాలను సేకరించవచ్చు. తుఫాను ముందు రోజున దాతకు మొదటి డోస్ స్థానికంగా చెన్నైలోనే ఇచ్చారు. తుపాను కారణంగా రెండవ డోస్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమైంది. దాత ఉంటున్న ప్రాంతంలోని వైద్య నిపుణుల సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మునుసామి ముందుకు వచ్చారు. మోటార్ సైకిల్‌పై ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యాహ్నానికి చెన్నై చేరుకున్నారు. కానీ రహదారులు ఎక్కడికక్కడ జలమయమై కనిపించాయి రోడ్లు కనిపించడం లేదు. సాహసం చేసి తన బైక్ ను వదిలి మూడు కిలోమీటర్ల నడిచి చివరికి దాత ఇంటికి చేరుకుని దాతకు ఇంజిక్షన్‌ ఇచ్చారు. ఆ మరుసటి రోజు కూడా దాతకు అదే విధంగా ప్రయాణించి వచ్చి మునుస్వామి ఇంజెక్షన్ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.