26 ఏళ్లుగా వ్యక్తి మిస్సింగ్.. పొరుగింట్లోనే బందీగా

|

May 18, 2024 | 2:38 PM

ఒక్కోసారి కొన్నాళ్లుగా కనిపించకుండా పోయిన వస్తువు మన ఇంట్లోనే ఉన్నా మనం గుర్తించలేం. ఏదోక సందర్భంలో అది అనూహ్యంగా బయటపడుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి అల్జీరియాలో జరిగింది. అయితే ఇక్కడ కనిపించకుండా పోయింది వస్తువు కాదు.. ఓ వ్యక్తి. ఇరవై ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరకు పొరుగింట్లోనే బందీగా ఉన్నట్టు తేలిన ఘటన అల్జీరియాలో వెలుగు చూసింది. ఈ షాకింగ్ ఘటన తాలూకు వివరాలను ఆ దేశ న్యాయశాఖ మంత్రి మంగళవారం వివరించారు.

ఒక్కోసారి కొన్నాళ్లుగా కనిపించకుండా పోయిన వస్తువు మన ఇంట్లోనే ఉన్నా మనం గుర్తించలేం. ఏదోక సందర్భంలో అది అనూహ్యంగా బయటపడుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి అల్జీరియాలో జరిగింది. అయితే ఇక్కడ కనిపించకుండా పోయింది వస్తువు కాదు.. ఓ వ్యక్తి. ఇరవై ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరకు పొరుగింట్లోనే బందీగా ఉన్నట్టు తేలిన ఘటన అల్జీరియాలో వెలుగు చూసింది. ఈ షాకింగ్ ఘటన తాలూకు వివరాలను ఆ దేశ న్యాయశాఖ మంత్రి మంగళవారం వివరించారు. 1998లో అల్జీరియా అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఒమార్ బీ అనే టీనేజర్ కనిపించకుండా పోయాడు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లు. ఒమార్‌ను ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని అతడి కుటుంబం భావించింది. కానీ, ఇంతకాలం అతడు తన పొరుగింట్లోనే బందీగా ఉన్నట్టు అనూహ్యంగా బయటపడింది. ఒమార్‌ను బంధించిన వ్యక్తి సోదరుడు ఆస్తి తగాదాల గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్టైంది. బాధితుడు ఆ ఇంటి పెరట్లోనే బందీగా ఉన్నట్టు తేలింది. నిందితుడు మరో టౌన్‌లోని మున్సిపాలిటీ కార్యాలయంలో డోర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, నిందితుడి మంత్ర ప్రయోగం కారణంగా తాను సాయం కోసం గొంతెత్తి పిలవలేకపోయానని బాధితుడు చెప్పినట్టు స్థానిక మీడియా ఆశ్చర్యకర కథనం వెలువరించింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా న్యాయశాఖ అభివర్ణించింది. బాధితుడికి శారీరక, మానసిక చికిత్సలు అందిస్తున్నామని, ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్త రూ.5ల కుర్‌ కురే తేలేదని విడాకుల వరకూ వెళ్ళిన దంపతులు

ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచిందంతే.. దవడ కాస్తా ??

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ హైవే

చనిపోయన పాముకు ఘనంగా అంతిమయాత్ర

AP: ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని

Follow us on