Spiderman: వింత హాబీ.. సాలీడుల‌ను సేక‌రిస్తూ కుంగుబాటుకు చెక్‌.! మానసిక ఆరోగ్యం కోసమే ఇలా చేస్తున్నాడు అంట.!

Updated on: Oct 18, 2022 | 9:43 AM

మాన‌సిక ఆరోగ్యం కుదుట‌ప‌డేందుకు ఏదో ఒక హాబీ అల‌వ‌ర‌చుకోవాల‌ని వైద్యులు సూచించ‌గా బ్రిట‌న్‌లోని బ్రిస్ట‌ల్‌కు చెందిన అరోన్ ఫీనిక్స్ వింత హాబీని చేప‌ట్టారు. 2021 వేస‌వి నుంచి సాలీడుల‌ను సేక‌రించ‌డం అరోన్ ప‌నిగా పెట్టుకున్నారు.


మాన‌సిక ఆరోగ్యం కుదుట‌ప‌డేందుకు ఏదో ఒక హాబీ అల‌వ‌ర‌చుకోవాల‌ని వైద్యులు సూచించ‌గా బ్రిట‌న్‌లోని బ్రిస్ట‌ల్‌కు చెందిన అరోన్ ఫీనిక్స్ వింత హాబీని చేప‌ట్టారు. 2021 వేస‌వి నుంచి సాలీడుల‌ను సేక‌రించ‌డం అరోన్ ప‌నిగా పెట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి అరోన్ వ‌ద్ద 120 సాలీడులు చేరాయి. ఆపై ఏడు నెల‌ల్లో వాటి సంఖ్య‌ను రెట్టింపు చేశాడు. ప్ర‌తి ఒక్క‌రికీ ఓ ప్యాష‌న్ ఉంటుంద‌ని, త‌న‌కు సాలీడుల సేక‌ర‌ణ ప్యాష‌న్‌గా మారింద‌ని అరోన్ చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌లు కూడా త‌న‌ను స్పైడ‌ర్‌-మ్యాన్‌గా గుర్తిస్తున్నార‌ని, వారు ప్ర‌తివారం నాకోసం బాక్స్‌లో లైవ్ యానిమల్స్‌ను తీసుకొస్తార‌ని చెప్పారు. వాటిని చూస్తూ తాను గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డుపుతాన‌ని సాలీడుల సేక‌ర‌ణ‌ను ఎప్ప‌టికీ విడిచిపెట్ట‌న‌ని స్ప‌ష్టం చేశారు. సాలీడులు త‌న మానిసిక ఆరోగ్యం మెరుగుప‌ర‌చ‌డంలో అద్భుతంగా ప‌నిచేశాయ‌ని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 18, 2022 09:42 AM