Man-Goat: మేకను పెళ్లి చేసుకున్న వ్యక్తి..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజనం

Updated on: Jun 18, 2022 | 9:24 AM

Man marriage with Goat: సోషల్‌మీడియా విస్తృతి పెరిగిన తర్వాత జనం దానికి బానిసలైపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంటర్నెట్‌లో పాపులర్‌ అవ్వాలనే ఉద్దేశంతో జనాలు రకరకాల వింత చేష్టలు చేస్తున్నారు.


సోషల్‌మీడియా విస్తృతి పెరిగిన తర్వాత జనం దానికి బానిసలైపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంటర్నెట్‌లో పాపులర్‌ అవ్వాలనే ఉద్దేశంతో జనాలు రకరకాల వింత చేష్టలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో షేర్‌ చేస్తున్నారు. తాజాగా ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పాపులర్‌ అవ్వాలనుకున్నాడు. అంతే వెంటనే ఓ మేకను తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.ఇండోనేషియాకు చెందిన సైఫుల్‌ ఆరిఫ్‌ అనే 44 ఏళ్ల వ్యక్తి జూన్‌ 5న శ్రీ రహాయు బిన్ బెజో అనే ఆడ మేకను ‘వివాహం’ చేసుకున్నాడు. ఆ మేకను నూతన వధువుగా అందంగా అలంకరించి, సంప్రదాయంగా షాలువా కప్పారు. ఇక వరుడు కూడా అందంగా ముస్తాబై వివాహానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ వివాహానికి అతని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు సంప్రదాయం ప్రకారం జావానీస్‌ దుస్తులు ధరించి హాజరయ్యారు. పెళ్లి సమయంలో వరుడు ‘అకాద్‌ నికాను’ కూడా పఠించాడట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటివి సంప్రదాయాలకు విరుద్ధమని, వాటిని ప్రోత్సహించకూడదని అంటున్నారు. కాగా ఇది కేవలం వినోదం కోసమే చేశామని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని సైఫుల్‌ తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

 

Published on: Jun 18, 2022 09:24 AM