Loading video

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

|

Mar 22, 2025 | 1:50 PM

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. మరికొన్ని వీడియోలు ఆలోచింపచేస్తాయి. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఆచి తూచి అడుగు వేయమంటారు ఇందుకే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి పొలానికి వెళ్తున్నాడు.

అలా పొలాల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ పొలంలో నీరు ఎక్కువగా నిలిచి పోయి కనబడింది. పొలానికి నీరు పెట్టి ఉంటారులే.. అందుకే నీరు ఉంది అనుకున్నాడు. చెప్పులు తీసి చేత్తో పట్టుకొని ఆ నీరు నిలిచిన ప్రదేశాన్ని దాటాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడుగు ముందుకు వేయగానే అతను నీటిలో మునిగిపోయాడు. నీళ్లలో మునిగిపోయిన ఆ వ్యక్తి.. కాసేపటికి పైకి లేచి ఊహించని ఈ పరిణామానికి అతను షాకయ్యాడు. బురద అంటకుండా నీటిని దాటాలని చూసి.. బురదలోనే కూరుకుపోయాడే అని అక్కడున్నవారంతా తెగ నవ్వుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పండు గుండె జబ్బులకు వరం.. ఒక్కసారి తిన్నా..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

ఈ పండ్లు తింటే.. షుగర్‌ మీ కంట్రోల్‌లో ఉంటుంది

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

ఈ రెండు సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపను అస్సలు తినకూడదు