ప్రేయసితో కలిసి లాడ్జ్‌లో స్టే చేసిన యువకుడు.. బాత్‌రూమ్‌లో ??

| Edited By: Ravi Kiran

Jun 08, 2024 | 11:00 PM

ప్రియురాలిని వెంటపెట్టుకొని ఓ శుభకార్యానికై నగరానికి వచ్చిన యువకుడు మద్యరాత్రిలో వాష్‌రూమ్‌కి వెళ్లాడు. అలా వెళ్లిన యువకుడు ఎప్పటికీ బయటకు రాకపోవడంతో ఏం జరిగిందోనని ప్రేయసి వెళ్లి చూసింది. అతను బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడి ఉండటంతో కంగారుపడిన యువతి అతని స్నేహితులకు ఫోన్‌ చేసింది. వారొచ్చి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వారొచ్చి, అప్పటికే అతను మృతిచెందినట్టు నిర్ధారించారు.

ప్రియురాలిని వెంటపెట్టుకొని ఓ శుభకార్యానికై నగరానికి వచ్చిన యువకుడు మద్యరాత్రిలో వాష్‌రూమ్‌కి వెళ్లాడు. అలా వెళ్లిన యువకుడు ఎప్పటికీ బయటకు రాకపోవడంతో ఏం జరిగిందోనని ప్రేయసి వెళ్లి చూసింది. అతను బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడి ఉండటంతో కంగారుపడిన యువతి అతని స్నేహితులకు ఫోన్‌ చేసింది. వారొచ్చి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వారొచ్చి, అప్పటికే అతను మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చర్లకు చెందిన హేమంత్ అనే 28 ఏళ్ల ఇటుక‌ల వ్యాపారికి అదే ప్రాంతానికి చెందిన యువ‌తితో ప‌రిచ‌యం ఏర్పడి, అది కాస్తా ప్రేమ‌గా మారింది. ఏడేళ్లుగా వీరిద్దరూ ప్రేమ‌లో ఉన్నారు. ఈ క్రమంలో హేమంత్ యువ‌తితో క‌లిసి సోమ‌వారం న‌గ‌రంలో జ‌రిగిన ఓ శుభ‌కార్యానికి హాజ‌ర‌య్యారు. రాత్రి ఎస్ఆర్‌న‌గ‌ర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో గ‌ది తీసుకుని బ‌స చేశారు. మ‌ద్యం సేవించిన హేమంత్ రాత్రి 2 గంట‌ల ప్రాంతంలో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే, ఎంత‌సేప‌టికి అత‌డు బాత్‌రూమ్ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన యువ‌తి వెళ్లి చూసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర