ట్రక్ పై డ్యాన్స్‌ చేస్తున్న యువకుడు.. బ్రిడ్జ్‌ ఢీకొట్టడంతో.. దారుణంగా..

ట్రక్ పై డ్యాన్స్‌ చేస్తున్న యువకుడు.. బ్రిడ్జ్‌ ఢీకొట్టడంతో.. దారుణంగా..

Phani CH

|

Updated on: Nov 22, 2022 | 8:46 PM

సోషల్‌మీడియాలో పాపులర్ కావాలనే కోరిక కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంది. అమెరికా టెక్సాస్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ యువకుడు ట్రక్‌ మీద ఎక్కి డాన్స్‌ చేస్తుండగా బ్రిడ్జి ఢీకొట్టింది.

సోషల్‌మీడియాలో పాపులర్ కావాలనే కోరిక కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంది. అమెరికా టెక్సాస్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ యువకుడు ట్రక్‌ మీద ఎక్కి డాన్స్‌ చేస్తుండగా బ్రిడ్జి ఢీకొట్టింది. దాంతో ట్రక్‌ మీద నుంచి కిందపడ్డాడు. మెడ, చేతులకు తీవ్ర గాయాలైన అతడిని వెంటనే దగ్గర్లోని మెమోరియల్ హెర్మన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదాన్ని ఆ దారి గుండా వెళ్తున్న మరో డ్రైవర్ వీడియో తీశాడు. హ్యూస్టన్‌లో వెళుతున్న తెలుపు రంగు ట్రక్‌ మీద ఒక యువకుడు డాన్స్ చేస్తున్నాడు. ఎదురుగా బ్రిడ్జి ఉందనే సంగతి మరిచిపోయి హుషారుగా డాన్స్‌ చేస్తూ, వీడియో రికార్డు చేస్తున్నాడు. అయితే, మొదటిసారి ఒక బ్రిడ్జి ఎదురుకావడంతో వెంటనే కిందికి వంగి తప్పించుకున్నాడు. కానీ, రెండోసారి తప్పించుకోలేకపోయాడు. దాంతో, బ్రిడ్జి బలంగా ఢీకొట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిందూ యువతిని చంపి.. ముక్కలుగా నరికిన ప్రియుడు..

ప్రసాదం తయారీకి.. కాంక్రీట్‌ మిక్సర్‌, పొక్లెయినర్లు !! ఎక్కడంటే ??

ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్‌ !! మీరూ అంతేనా ?? తస్మాత్‌ జాగ్రత్త

Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్

అల్లు అర్హ అల్లరి మాటలకు మురిపోతున్న బన్నీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

 

Published on: Nov 22, 2022 08:46 PM