లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. పారా గ్లైడింగ్ చేస్తున్న ఓ వ్యక్తి కిందకు వచ్చి నేల మీద ఉన్న వ్యక్తితో మాట్లాడి తిరిగి పైకి వెళ్లాడు. ఓ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో గోవాలో షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఓ వ్యక్తి పారా గ్లైడింగ్ చేస్తూ ఓ కొండకు దగ్గరగా వచ్చాడు.
ఆ సమయంలో ఆ కొండ మీద ఉన్న వ్యక్తి.. ఆ పారా గ్లైడర్‌ను ఉద్దేశించి.. నీ దగ్గర లైటర్ ఉందా అని అడిగాడు. దీంతో ఆ పారా గ్లైడర్ తన జేబులో ఉన్న లైటర్ ను తీసి కొండ మీద ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి దానిని ఇచ్చి మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ట్యాలెంట్ ఉంటే తప్ప అలా పారాగ్లైడింగ్ చేయడం కష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాపింగ్ మాల్‌లో కోతి హంగామా.. ఓ యువతి తలపైకి ఎక్కి..
కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్