అనంత్‌ అంబానీ – రాధికా మర్చెంట్‌ ‘మామెరు’ ఫంక్షన్‌.. ఇదేం వేడుక ??

|

Jul 08, 2024 | 9:33 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. మరికొన్ని రోజుల్లో ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ - రాధికా మర్చెంట్‌ వివాహం జరగనుంది. ఈ జంట నిశ్చితార్థం మొదలు.. ప్రతి వేడుకా అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా బుధవారం రాత్రి వీరికి ‘మామెరు’ వేడుక నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్‌ నటీనటులు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. మరికొన్ని రోజుల్లో ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ – రాధికా మర్చెంట్‌ వివాహం జరగనుంది. ఈ జంట నిశ్చితార్థం మొదలు.. ప్రతి వేడుకా అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా బుధవారం రాత్రి వీరికి ‘మామెరు’ వేడుక నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్‌ నటీనటులు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ వేడుక ఏంటా అని నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. మామెరు అనేది గుజరాతీ సంప్రదాయ వేడుక. దీని ప్రకారం.. వివాహానికి ముందు వరుడు తల్లి పుట్టింటివాళ్లు లేదా వరుడి మేనమామలు సంప్రదాయబద్ధంగా కాబోయే వధూవరులకు కానుకలు తీసుకొచ్చి ఆశీర్వదిస్తారు. అనంత్‌-రాధిక జంటకు బుధవారం ఈ వేడుక నిర్వహించారు. ఇందులో నీతా తల్లి పూర్ణిమ దలాల్‌, ఆమె సోదరి మమత తదితరులు అంబానీ ఇంటికి వచ్చి కాబోయే దంపతులకు బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ వేడుకను అంబానీ కుటుంబం ఎంతో ప్రత్యేకంగా చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైకు సర్వీసింగ్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన మెకానిక్‌ షాక్‌..

ఇంటిని దోచేసి.. క్షమించమని లెటర్‌ రాసి వెళ్లిన దొంగ !!

ఉద్యోగుల జీతాలు పెంచిన యజమానులకు మూడేళ్లు జైలు..

1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం !!

జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం.. ఎందుకంటే ??