Kolkata Rape Case: ‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో కోల్‌కతా వైద్యురాలి స్నేహితుడి కవిత.!

Kolkata Rape Case: ‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో కోల్‌కతా వైద్యురాలి స్నేహితుడి కవిత.!

Anil kumar poka

|

Updated on: Sep 14, 2024 | 7:24 PM

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనలో ఆమె స్నేహితుడు మానసిక వేదనకు గురయ్యాడు . ఒకే బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుని అనుకున్నారట. కౌన్సెలింగ్‌ తీసుకొని ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నాడు. న్యాయం కోసం ఆమె కుటుంబంతో కలిసి పోరాడుతున్నాడు. తన ఆవేదననంతా కవిత రూపంలో పంచుకున్నాడు. సీఎం మమత వ్యాఖ్యలను ఖండిస్తూ తన దుర్గ న్యాయం అడుగుతోందనీ తాను ఏ వేడుకా చేసుకోలేననీ రాసుకొచ్చాడు.

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనలో ఆమె స్నేహితుడు మానసిక వేదనకు గురయ్యాడు . ఒకే బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుని అనుకున్నారట. కౌన్సెలింగ్‌ తీసుకొని ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నాడు. న్యాయం కోసం ఆమె కుటుంబంతో కలిసి పోరాడుతున్నాడు. తన ఆవేదననంతా కవిత రూపంలో పంచుకున్నాడు. సీఎం మమత వ్యాఖ్యలను ఖండిస్తూ తన దుర్గ న్యాయం అడుగుతోందనీ తాను ఏ వేడుకా చేసుకోలేననీ రాసుకొచ్చాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటన జరిగి నెల రోజులు దాటిందని, ఇకనైనా ప్రజలు దాన్ని మరిచి దుర్గా పూజలకు సిద్ధం కావాలని ఆమె అన్నారు. దీదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ వైద్యురాలి స్నేహితుడు ఓ కవిత రాశాడు. దాన్ని ఓ ఇంగ్లిష్‌ మీడియాతో పంచుకున్నాడు.

తనతో జీవితం పంచుకుంటుందనుకున్న అమ్మాయి.. ఓ మృగాడి పైశాచికానికి బలైందని తెలిసి అతడి గుండె పగిలింది. ఆమె చనిపోయిందని తెలియగానే భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కట్టుకున్న అతడి కలల గూడు ఒక్క రాత్రిలో చెదిరిపోయింది. నాడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రోణాచార్యుడు మౌనంగా ఉండిపోయాడు. నేడు శక్తిస్వరూపిణి కొలువైన నగరంలో ఓ దుర్గ న్యాయం కోసం విలపిస్తోంది. ఓ న్యాయ దేవతా.. నీ కళ్లకు ఇంకా ఆ గంతలేనా? న్యాయం కోసం ఈ నగరం అర్థిస్తోంది. ఈ వేదన అనుభవించలేమని చెబుతోంది. నా ‘దుర్గ’ న్యాయం అడుగుతోంది. నేను వేడుక చేసుకోలేను, అంటూ అతడు తన ఆవేదనను ఇలా కవిత రూపంలో పంచుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.