TV9 Ismart News: కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే | QR కోడ్ తో వయ్యారంగ దోస్తుండ్రు.

TV9 Ismart News: కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే | QR కోడ్ తో వయ్యారంగ దోస్తుండ్రు.

Anil kumar poka

|

Updated on: Sep 14, 2024 | 8:08 PM

నిన్నియ్యాల ఎమ్మెల్యేంటే ఎట్లుండ్రు కొంతమంది..ఆల్లొస్తే జనాలు వంగి వంగి నమస్తే పెట్టాలే అనేతట్టుండ్రు.. ఒగాల నమస్తే పెట్టకుంటే కూడ వాడేంది వాన్కి వాడు ఎక్వ ఊహించుకుంటుండా..మనం పోతే నమస్తే కూడ పెట్టడా అని ఇగోహర్టు అయ్యేటోల్లు కూడ ఉన్నరు..గిసోంటి జమానాల ఒ ఎమ్మెల్యే మోకాల్ల మీద నిలవడి మరీ జనాలకు దండాలు పెట్టిండు.. మరీ ఎందుకు ఏందన్నది సూద్దాం పార్రి

పబ్లిక్కు మొకాళ్ల దండం బెట్టిన ఎమ్మెల్యే
అర్వయ్ లక్షల సాయంజేశిర్రట అడ్గంగనె

కార్యకర్తలకు టీవీలు ఫ్రిజ్జులు కొనిచ్చిన టీడీపీ లీడర్
లీడరంటె నువ్వే అన్నా అని మెచ్చుకుంటున్నరట క్యాడర్

పోలీస్టవునుకు చేరిన కుక్క పంచాది
అది నాదంటె నాదే అని ఇద్దరు వడ్తున్రు పోటీ

గన్పతి మండపాలకు కరెన్సీ నోట్ల ముస్తాబు
కోట్ల ఇల్వగల్ల కొత్త నోట్లతోటి డెకరేషన్లు

నిన్నియ్యాల ఎమ్మెల్యేంటే ఎట్లుండ్రు కొంతమంది..ఆల్లొస్తే జనాలు వంగి వంగి నమస్తే పెట్టాలే అనేతట్టుండ్రు.. ఒగాల నమస్తే పెట్టకుంటే కూడ వాడేంది వాన్కి వాడు ఎక్వ ఊహించుకుంటుండా..మనం పోతే నమస్తే కూడ పెట్టడా అని ఇగోహర్టు అయ్యేటోల్లు కూడ ఉన్నరు..గిసోంటి జమానాల ఒ ఎమ్మెల్యే మోకాల్ల మీద నిలవడి మరీ జనాలకు దండాలు పెట్టిండు.. మరీ ఎందుకు ఏందన్నది సూద్దాం పార్రి

అబ్బ..ఎంత గొప్ప మనసుల్లా.. గా ఏపీ టీడీపీ లీడర్ బుద్ద వెంకన్న సారుదైతె.. అన్న పేరు వెంకన్న.. అన్న మనసు వెన్నంత.. అని అనబుద్దయితుంది గీ ముచ్చటెర్కయినంక. మామూలుగ వర్ద బాదితులకు అప్పటిమందం పూటకెల్లేతట్టు సాయంజేస్తుంటరు ఎవ్వలైనా.. కనిగొ.. ఎప్పటికి మర్శిపోలేంత సాయంజేస్తుండట సారు.. ఏంజేస్తుండో సూస్తిరాంటె.. వెంకన్న నువ్వు అందరికంటె మిన్నా అని మీరుగూడ అంటరేమొ..

శానమంది ఇండ్లల్ల టీవీ రిమోట్ నాదంటే నాదని మస్తుగ పైటింగు చేస్కుంటరు.. ఇంట్లిద్దరు పిలగాండ్లు ఉన్నప్పుడు ఏదన్న ఒక్కటే బొమ్మ తెస్తే ఇది నాకంటే నాకని పైటంగులు చేస్కుంటరు..అగో గట్లనే గీడోకాడ ఈ కుక్క నాదంటే నాదని ఇద్దరు కుక్కకోసం కోట్లాట పెట్టకుండ్రు..

ఆపతొచ్చిన.. ఆందోళనలైన, అల్లర్లైన, దొంగలుపడ్డ, దోపిడీలు జర్గిన , టక్కర్లైన, మోసాలైన, ఎవ్వడన్న కొట్టినా..తిట్టినా, బెద్రిచ్చిన, వానొచ్చిన..వర్దొచ్చిన ఏమైన కూడ అందరు ముందు గాలు ఉర్కేది పోలీస్టేషన్కే.. అట్ల అందరి బాదలు అర్సుకునే పోలీస్టేషనే ఇప్పుడు వర్ద బాదిత స్టేషనైంది ఓకాడ

నీ మోసగాళ్ల నోట్లె మన్నువొయ్య.. అరరరే.. తెల్లారి లేశిన కాడికేలి నిద్రవొయ్యేదంక.. మందిని ఎన్నితీర్ల మోసం జెయ్యచ్చన్న రీసెర్చులేమన్న చేశొస్తున్నరా ఏందసలు? అగొ.. క్యూఆర్ కోడ్ బాక్సు చెక్ చెయ్యాలె అని అకౌంట్ల ఉన్న పైసలు, క్రెడిట్ కారెట్లున్న పైసలన్ని ఊడ్శేశిండట మెదక్ జిల్లా నర్సాపూర్ల గీ సేటోల్ల షాపుకొచ్చిన దొంగ సచ్చినోడు .. సూడుర్రి ఎట్ల మోసం చేశిండో..

రాస్ట్రంల లీడర్ల తిట్లు.. కుక్కల కాట్లు శాన కామనైపోయినయి. బైటికెల్లినోల్లు కుక్కల తోటి పిక్కలు కర్పిచ్చుకోకుంట పక్కాగా ఇంటికొస్తరన్న గ్యారెంటీ లేకుంట పోయింది.. పసి గుడ్ల కాన్నుంచి పండు ముసలోల్ల దాక ఎవ్వల్ని ఇడుస్తలేవు. దొర్కుతే బర్కుతున్నయి..అందుకే కుక్కలు కర్షిన బాదితులకు సర్కారు క్షమాపణ లెటర్ రాషి ఇర్వైదువేల రూపాల పాయమాల్ కట్టియ్యాలని డిమాండు చేస్తుండు గీ అన్న

గన్పతి మండపాలను ముద్దుగ ముస్తాబు చేసుట్ల ఎంత క్రియేటివిటీ సూపెడ్తరో ఎర్కున్న ముచ్చటేగదా? ఇగట్లనే గా ఎన్టీఆర్ జిల్లా నందిగామల నిలవెట్టిన గన్పతినిగూడ డెకరేషన్ చేశిర్రుల్లా.. ఆ డెక్రేషన్ సల్లగుండ.. దేవున్ని సూడాల్నా.. డెక్రేషన్లు సూడాల్నా సమజైతలేదట దర్శనానికొచ్చిన భక్తులకు.. సూస్తందుకు రొండుగాదు.. రొండొందల కండ్లున్నా సరిపోవేమొ అన్పిస్తుందట.. మరి అంతగనం ఏముందో ఇచ్ఛంత్రం.. పార్రి సూద్దాం మనంగూడ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.