వాష్‌రూమ్‌లో నుంచి భారీ శబ్ధం.. వెళ్లి చూస్తే..అమ్మబాబోయ్‌..

Updated on: Dec 01, 2025 | 8:57 PM

మలేషియాలో ఓ కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంట్లోని బాత్‌రూమ్‌ పైకప్పులో 16 అడుగుల భారీ కొండచిలువను గుర్తించి భయభ్రాంతులకు గురయ్యారు. శబ్దాలు విని పరిశీలించగా, కెమెరాలో పామును చూశారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి 60 కిలోల పామును రక్షించి అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఓ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నారు. ఇంతలో వారి బాత్రూమ్‌లో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది ఏమై ఉంటుందా అని అంతా అటు పరుగెత్తారు. బాత్రూమ్‌ పై కప్పులో రంధ్రం కనిపించింది. దానినుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో కొంచెం దగ్గరగా వెళ్లి పరిశీలించారు. దెబ్బకు హడలెత్తిపోయిన వారంతా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన మలేషియాలో జరిగింది. మలేషియాలోని కెడాలో ఓ ఇంట్లోని వారికి ఈ అనుభవం ఎదురైంది. బాత్రూమ్‌లో నుంచి శబ్ధాలు రావడంతో అక్కడికి వెళ్లి చూసిన వారికి వాష్‌రూమ్‌ పై కప్పులో ఓ రంధ్రం కనిపించింది. దానిలో ఏదో కదులుతున్నట్టు వారికి అనిపించింది. దాంతో వారు ఏమై ఉంటుందా అని ఫోన్‌ కెమెరాను ఆ రంద్రంలోకి జూమ్‌ చేసి చూడగా అందులోనుంచి ఓ పెద్ద కొండచిలువ బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. దెబ్బకు భయంతో వణికిపోయారు. వెంటనే జంతు సంరక్షణ బృందానికి ఫోన్ చేశారు. ఆ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ టీం సభ్యులను కూడా కొండచిలువ భయపెట్టింది. ఆ కొండ చిలువ ఏకంగా 16 అడుగుల పొడవు, 60 కిలోల బరువు ఉంది. ఆ భారీ కొండ చిలువను బయటకు రప్పించడానికి చాలా కష్టపడ్డారు రెస్య్యూ టీం. మొత్తానికి భారీ కొండచిలువను బంధించారు. అనంతరం దానిని నివాస ప్రాంతాలకు దూరంగా అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో ఆ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రూ-కాలర్ కాదు.. అంతకు మించి.. ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాకే

వీరికి సీతాఫలం విషంతో సమానం.. హెచ్చరిస్తున్న వైద్యులు

డెడ్‌బాడీకి అంత్యక్రియలు.. అనుమానంతో చెక్‌చేసిన కాటికాపరి షాక్‌

గోవా ట్రిప్‌ పేరుతో క్యాసినోల్లో జూదం.. ఆస్తులు కుదువపెట్టి అప్పులపాలవుతున్న యువత

ఈ గుడ్డు ధర రూ. 236 కోట్లు.. అంతలా ఏముందిరా దీనిలో..