Shukoor: పెళ్లైన తన భార్యను షుకూర్ మళ్లీ పెళ్లి చేసుకున్న మళయాళీ నటుడు షుకూర్
కేరళకు చెందిన మళయాళీ నటుడు షుకూర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెళ్లైన 29 ఏళ్ల తర్వాత తన భార్యను మరోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇందుకు ముహూర్తంగా
కేరళకు చెందిన మళయాళీ నటుడు షుకూర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెళ్లైన 29 ఏళ్ల తర్వాత తన భార్యను మరోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇందుకు ముహూర్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నే ఎంచుకున్నారు. ఇదంతా ఎందుకంటే తన పిల్లలకు దక్కకుండాపోతున్న ఆస్థి కోసమేనట. నటుడు, న్యాయవాది షుకూర్ 1994 అక్టోబర్‌లో డాక్టర్ షీనాను పెళ్లాడాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆయన ఆస్తి పూర్తిగా వారి కూతుళ్లకు రాకుండా అతడి సోదరులకు సైతం వాటా అందుతుంది. ఈ విషయం షుకూర్‌కు మింగుడుపడలేదు. అదే కొడుకులకైతే పూర్తి ఆస్తి దక్కుతుంది. కానీ కూతుళ్లపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలో తన ఆస్తి మొత్తం తన కుమార్తెలకే దక్కే హక్కును కల్పిస్తున్న ప్రత్యేక వివాహ చట్టం కింద తన భార్యను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పునర్వివాహం చేసుకుంటున్నారు. కూతుళ్ల సమక్షంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహం చేసుకుంటున్నాడు. ఆస్తిలోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ఉద్ధేశ్యంతోనే ఇలా చేశానన్నాడు షుకూర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

