విహారయాత్రకు వెళ్ళొచ్చి.. ఇంటి గడియ తీసుంచి.. ఏంటా అని చూడగా..

Updated on: Dec 13, 2025 | 12:19 PM

మలక్‌పేట మానస రెసిడెన్సీలో వెంకటరమణ కుటుంబం విహారయాత్ర నుండి తిరిగి రాగా, వారి ఇంట్లో ₹45 లక్షల నగదు, 17 తులాల బంగారం చోరీ జరిగింది. అపార్ట్‌మెంట్ మాజీ వాచ్‌మెన్, నేపాల్‌కు చెందిన అర్జున్‌పై అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నేపాలి గ్యాంగ్ చోరీల బెడద పెరుగుతున్న నేపథ్యంలో, మలక్‌పేట పోలీసులు సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు.

మలక్‌పేట్‌లో నేపాలి గ్యాంగ్ అనుమానితులుగా మరో చోరీ ఘటన జరిగింది. మానస రెసిడెన్సీలో నివాసముంటున్న వెంకటరమణ కుటుంబం ఇటీవల విహారయాత్ర కోసం బయటకు వెళ్లి బుధవారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకున్నారు. సుమారు 5:30 గంటలకు అపార్ట్మెంట్‌కు వచ్చిన వారు ప్రధాన తలుపు పగులగొట్టి ఉండటాన్ని గమనించి అనుమానంతో లోపలికి వెళ్లారు. వెంటనే బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన వెంకటరమణ కుటుంబ సభ్యులు ఇంటిలో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలు అదృశ్యమై ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఇంటిలోని అల్మారాలు చెదరగొట్టి ఉండగా, దొంగలు సుమారు 45 లక్షల రూపాయల క్యాష్‌, 17 తులాల బంగారం, నాలుగు కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే మలక్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసిన నేపాల్‌కు చెందిన అర్జున్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్‌ 25న ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్జున్ అకస్మాత్తుగా ఉద్యోగాన్ని వదిలి అపార్ట్మెంట్‌ నుంచి వెళ్లిపోయాడు. ఈ కారణంగా అతని పాత్రపై పోలీసులు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మలక్‌పేట్‌ పోలీసులు అపార్ట్మెంట్‌ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తూ, అర్జున్‌పై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనంలో అతనికి సంబంధం ఉందా? లేక మరెవరైనా ఈ ఘటన వెనుక ఉన్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న నేపాలి గ్యాంగ్ చోరీలపై ఇంటి ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు అపార్ట్మెంట్‌లోని ఇతర సిబ్బంది, పొరుగువారిని కూడా ప్రశ్నిస్తున్నారు. అర్జున్ గతంలో ఎలాంటి ప్రవర్తన చూపాడో, అతనికి సహకరించే మరెవరైనా ఉన్నారో తెలుసుకుంటున్నారు. దొంగతనం జరిగిన సమయానికి అపార్ట్మెంట్‌ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు తిరిగారా అన్న దానిపై కూడా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే సీసీటీవీ ఆధారాలు సాంకేతిక ఆధారంగా నిందితుని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క వ్యక్తి జన్యువులో లోపం.. 200 మంది పిల్లలకు శాపం

ఫాం హౌస్‌ పార్టీ వివాదం.. మాకేం సంబంధం లేదన్న మాధురి, శ్రీనివాస్

Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్

Emanuel: టాస్క్‌లో గాయపడ్డ ఇమ్మాన్యుయేల్‌! నొప్పితో విలవిల

పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది