Bullet cycle: సైకిల్‌తో బుల్లెట్‌ బైక్‌ తయారు చేసిన తెలివైన వ్యక్తి..! సోషల్ మీడియా దూసుకుపోతున్న బుల్లెట్.. (వీడియో)

Updated on: Nov 23, 2021 | 9:24 AM

ఈ రోజుల్లో పెట్రోల్ ధర రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి తనలోని క్రియేటివిటీని వెలికితీసి ‘బుల్లెట్ ఎక్స్‌ప్రెస్’ అనే సైకిల్‌ను తయారు చేశాడు. ఇప్పుడిది ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.


ఇక్కడో వ్యక్తి సైకిల్‌కు బుల్లెట్ లుక్ ఇచ్చినట్లు మీరు చూడవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ సీటు కవర్, వెనుక భాగాన్ని ఆ వ్యక్తి తన సైకిల్‌కు అమర్చాడు. అంతేకాకుండా వెనుక తన భార్యను కూర్చోబెట్టుకుని రైడ్‌కు వెళ్తున్నాడు. అలాగే ఆ సైకిల్‌కు హ్యాండిల్‌ బదులుగా స్టీరింగ్‌ను పెట్టాడు. ఎంచక్కా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాడు. అతడు నడుపుతున్న తీరును చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. ఇక రోడ్డుపై వెళ్తున్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు.. ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అయిపోయారు. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. నిజంగా ఈ క్రియేటివిటీ వేరే లెవెల్ అంటూ వేరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 23, 2021 09:16 AM