Viral Video: బుడ్డది కాదు చిచ్చర పిడుగు.. చిన్నారి డేంజరస్ స్టంట్.? నెట్టింట వీడియో సెన్సేషన్!

సోషల్ మీడియాలో వివిధ రకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని..

Viral Video: బుడ్డది కాదు చిచ్చర పిడుగు.. చిన్నారి డేంజరస్ స్టంట్.? నెట్టింట వీడియో సెన్సేషన్!
Viral Video
Follow us

|

Updated on: Nov 23, 2021 | 12:08 PM

సోషల్ మీడియాలో వివిధ రకాల ఛాలెంజ్‌లు, స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాన్ని సృస్టిస్తాయి. లైకుల కోసం ఈ మధ్యకాలంలో యువత చేయకూడదని రిస్క్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనుభవజ్ఞులైన స్టంట్ మాస్టర్లు చేసే ఓ డేంజరస్ స్టంట్‌ను ఓ చిన్నారి చేసి చూపించిందన్నట్లుగా ఉన్న ఆ వీడియోను చూసిన తర్వాత మీకు కూడా గూస్ బంప్స్ రావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ చిన్నారి 4 చక్రాల బైక్‌తో ర్యాంప్‌పై పల్టీలు కొట్టినట్లు మీరు చూడవచ్చు. అయితే బైక్‌పై ఉన్నది అమ్మాయి కాదని.. అదొక బొమ్మ అని చాలామంది నెటిజన్లు అంటున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోను చూసేయండి.

View this post on Instagram

A post shared by Selma (@selmamordovskaya)

కాగా, ఈ వీడియోను ‘selmamordovskaya’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. ‘ఇది వాస్తవమా.? లేక నకిలీనా అని తెలుసుకోవడానికి దీనిని 5 సార్లు చూశాను’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇప్పటిదాకా ఈ వీడియోకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. అతడు ఈ వీడియోను అక్టోబర్ 3వ తేదీన అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నెటిజన్లు ఈ వీడియోపై భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆ అమ్మాయి గురించి ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు అది ఫేక్ అని.. బొమ్మని పెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా వీడియోను తీశారని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ బైక్‌పై చిన్నారి ఉందా.? లేక బొమ్మా.? మీరేమంటారు.!