ఒంటినిండా రోమాలు.. తోడేలులా యువకుడు !! భయపడుతున్న జనం..

ఒంటినిండా రోమాలు.. తోడేలులా యువకుడు !! భయపడుతున్న జనం..

Phani CH

|

Updated on: Nov 30, 2022 | 9:27 AM

మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్‌ పాటిదార్‌ అనే 17 ఏళ్ల యువకుడు వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది చాలా అరుదైన వ్యాధి.

మధ్యప్రదేశ్‌ రత్లాం జిల్లాలోని నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్‌ పాటిదార్‌ అనే 17 ఏళ్ల యువకుడు వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది చాలా అరుదైన వ్యాధి. తల నుంచి కాలిగోటి వరకు దట్టంగా పెరిగిన వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నాడు. లలిత్ ముఖంపై 5 సెంటీమీటర్ల వరకు దట్టమైన జుట్టు పెరిగిపోయింది. చిన్నప్పుడు కొందరు ఇతడిని హనుమంతుని బాల స్వరూపంగా భావించి పూజించేవారు. మరికొందరు ముఖం చూస్తేనే భయపడేవారు. లలిత్‌ పుట్టినప్పుడే ఒళ్లంతా వెంట్రుకలతో పుట్టాడు. అయితే అవి సాధారణ రోమాలే అనుకొన్న వైద్యులు.. అప్పుడే వాటిని తొలగించారు. ఆరేళ్ళు వచ్చేసరికి లలిత్‌ శరీరం అంతా వెంట్రుకలు పెరిగాయి. దీంతో లలిత్ తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా వేర్‌ఉల్ఫ్‌ సిండ్రోమ్‌ వ్యాధి బారినపడినట్లు చెప్పారు. అరుదైన ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 50 మందికి మాత్రమే ఈ వ్యాధి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమాధుల మధ్య టీ స్టాల్‌.. అదృష్టం కలిసొస్తుందన్న సెంటిమెంట్‌..

‘నాకు భార్యవి అవుతావా ??’ ఇన్‌స్టాలో బాలుడి షాకింగ్‌ స్టేటస్‌

ఐస్‌క్రీం ఇవ్వలేదని ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి !!

పాకిస్థానీల ప్రేమ వెలకట్టలేనిదంటూ హైదరాబాదీల ఆనందం..

నాగాలాండ్‌లో గ్రాండ్‌గా బండలాగుడు ఉత్సవం.. చూడాల్సిందే..

 

Published on: Nov 30, 2022 09:27 AM