అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది..పాపం వీడియో

Updated on: Aug 29, 2025 | 7:31 AM

కొందరు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఎంతో కష్టపడి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరీక్షలకు సిద్ధమవుతారు. పరీక్షలు రాసిన తర్వాత వాటి ఫిలితాలకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదిస్తే వారి ఆనందానికి అవధులుండవు. అలా కలలు కన్న ఓ యువకుడికి చివరికి కన్నీరే మిగిలింది. కష్టపడి డీఎస్‌సీలో మెరిట్‌ సాధించి టీచర్‌జాబ్‌ కి సెలెక్ట్‌ అయ్యాడు. తన కల నెరవేరిందని సంతోషపడే లోపే దురదృష్టం అతన్ని వెంటాడింది. అగ్ని ప్రమాదంలో అతని సర్టిఫికెట్స్‌ మొత్తం కాలిపోయాయి. దీంతో లబోదిబోమంటున్నాడు.

నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లె లో మధు అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. DSC తాజా ఫలితాల్లో 80.53 మార్కులు సాధించిన మధు జిల్లా స్థాయిలో 773 ర్యాంకు సాధించారు. మూడు రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాల్సిందిగా అధికారుల నుంచి సమాచారం వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు అతని ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్రిడ్జ్‌ పక్కన ఉంచిన అతని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు మంటల్లో కాలిపోయాయి. దాంతో తన కల, కష్టం కళ్లముందే బూడిదైపోవడంతో లబోదిబోమంటున్నాడు. జరిగిన ప్రమాదం గురించి బాధితుడు స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియజేసారు. అధికారులు మధు ఇంటికి వచ్చి ప్రమాద ఘటనను పరిశీలించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ విషయంలో తనకు న్యాయం చేయాలని విద్యాశాఖామంత్రి నారాలోకేష్‌, స్థానిక మంత్రి తనకు సహాయం చేయాలని మధు, స్థానికులు వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రన్నింగ్ ట్రైన్‌ ఎక్కబోతూ కిందపడ్డ మహిళ.. తర్వాత ఏమైందంటే? వీడియో

యువతి ప్రా*ణం తీసిన ట్రయాంగిల్‌ లవ్‌..వీడియో

రణ్‌బీర్ కపూర్‌, ఆలియా .. రూ. 250 కోట్ల లగ్జరీ భవనం చూశారా వీడియో