M87 galaxy Black Hole: M87 కృష్ణబిలం అచ్చు భూమిలా గిరగిరా తిరుగుతోంది..!

Anil kumar poka

|

Updated on: Oct 03, 2023 | 4:00 PM

కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూమిలా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని బయటపెట్టారు. నాలుగేళ్ల క్రితం ఈవెంట్‌ హోరైజాన్‌ టెలీస్కోప్‌ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు.