Viral: హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

|

Dec 23, 2024 | 10:02 AM

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రద్దీగా ఉండే అజ్మీర్ రోడ్డులో ఎల్‌పీజీ(LPG), సీఎన్‌జీ (CNG) ట్యాంకర్లు ఢీకొన్నాయి.. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. పదుల సంఖ్యలో వాహనాలు దగ్దమయ్యాయి..

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ పంపు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకన్న పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎల్‌పిజి ట్యాంకర్‌, సిఎన్‌జి ట్రక్కు రెండూ ఢీకొన్నాయని, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పరస్పరం ఢీకొన్న అనంతరం ఓ ట్యాంకర్ వాహనాలపైకి దూసుకెళ్లింది. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అధికారులు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. జైపూర్-అజ్మీర్ హైవే ప్రమాదంలో దాదాపు 24 మంది గాయపడినట్ట సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 40 వాహనాలకు మంటలు అంటుకున్నాయని జైపూర్ డీఎం జితేంద్ర సోనీ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.