Lord Hanuman: తక్షణం ఆలయం ఖాళీ చేయండి.. హనుమంతుడికి అధికారుల నోటీసులు..
సాధారణంగా ఎవరైనా తమ భూమిన కబ్జా చేస్తే వారికి కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించడం పరిపాటి. తాజాగా ఇది దేవుళ్లకు కూడా వర్తిస్తోంది. ఇటీవల దేవుళ్లకు కూడా ఇలాంటి నోటీసులు అందుతున్నాయి. అవును రామదూత
సాధారణంగా ఎవరైనా తమ భూమిన కబ్జా చేస్తే వారికి కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించడం పరిపాటి. తాజాగా ఇది దేవుళ్లకు కూడా వర్తిస్తోంది. ఇటీవల దేవుళ్లకు కూడా ఇలాంటి నోటీసులు అందుతున్నాయి. అవును రామదూత హనుమంతుడికి కూడా ఇలాంటి నోటిసులు వచ్చాయి. వారం రోజుల్లో ఆలయం ఖాళీ చేయాలంటూ హనుమంతుడికి నోటీసలు పంపించారు అధికారులు. హనుమంతుడు రైల్వే భూమిని ఆక్రమించాడట. వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే తదుపరి చర్యలు తప్పవంటూ మధ్యప్రదేశ్ అధికారులు నోటీసులు పంపారు. మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో కొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్వాలియర్-షియోపూర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైనుకు ఓ హనుమాన్ గుడి అడ్డంగా మారింది. దీంతో అధికారులు వెంటనే హనుమంతుడికి నోటీసులు పంపించారు. రైల్వే భూమిని హనుమంతుడు ఆక్రమించినట్టు పేర్కొంటూ ఈ నెల 8న ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం కాస్తా నెట్టింట చేరి వైరల్ కావడంతో అధికారుల తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన అధికారులు.. ఆలయ యజమానికి నోటీసులు ఇవ్వబోయి హనుమంతుడికి ఇచ్చారని, పొరపాటు జరిగిందని ఝాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ మాథుర్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..