మద్దిచెట్టులో వినాయకుని రూపం..వింతను చూసేందుకు క్యూగట్టిన జనం

|

Jan 31, 2024 | 8:04 PM

సాధారణంగా తెల్ల జిల్లేడు చెట్టు ఏళ్లు గడిచేకొద్దీ దాని వేర్లలో వినాయకుని రూపం ఏర్పడుందని చెబుతారు.. ఆ రూపాన్ని అర్కగణపతిగా పూజిస్తారు కూడా. ఇలా ఏర్పడిన ప్రతిమలు ఆలయాల్లో పూజలు సైతం అందుకుంటున్నాయి. అయితే తాజాగా ఏలూరు జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. ఇక్కడ ఓ మద్దిచెట్టు వేర్లలో వినాయకుని రూపం ఏర్పడింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు.

సాధారణంగా తెల్ల జిల్లేడు చెట్టు ఏళ్లు గడిచేకొద్దీ దాని వేర్లలో వినాయకుని రూపం ఏర్పడుందని చెబుతారు.. ఆ రూపాన్ని అర్కగణపతిగా పూజిస్తారు కూడా. ఇలా ఏర్పడిన ప్రతిమలు ఆలయాల్లో పూజలు సైతం అందుకుంటున్నాయి. అయితే తాజాగా ఏలూరు జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. ఇక్కడ ఓ మద్దిచెట్టు వేర్లలో వినాయకుని రూపం ఏర్పడింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అది వినాయకుని మహిమేనంటూ పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం పక్కన మద్ది చెట్టు క్రింది భాగంలో పెద్ద పెద్ద వేర్లు బయటికి చొచ్చుకుని వచ్చాయి. అలా బయటికి వచ్చిన మద్ది చెట్టు వేర్ల రూపం అచ్చం వినాయకుడిని పోలి ఉంది. దాంతో అది సాక్షాత్తు వినాయకుని మహిమేనని, తన భక్తుల కోరికలు తీర్చేందుకు ఇలా మద్ది చెట్టులో వేర్ల రూపంలో మనకు సాక్షాత్కారమయ్యారని భక్తులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం

మితిమీరిన ఉత్సాహం జైలుకు పంపింది.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

చేతి స్పర్శను కోల్పోయి ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్

Follow us on