Lohit Express: ఇంజన్ వెళ్లిపోయింది.. భోగీలు ఉండిపోయాయి..! రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు.
ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్ నుంచి విడిపోయాయి.అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు
ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్ నుంచి విడిపోయాయి.అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర భమాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు నుంచి కిందికి దూకేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలా – బీహార్‌లోని కిషన్‌గంజ్ మధ్య ఉన్న సూర్యకమల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఇంజన్ ముందుకు కదిలివెళ్లిపోవడంతో.. పది కోచ్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన ఘటనాస్థలికి చేరుకుని ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్‌కు జతచేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐతే రైలు 16 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కప్లింగ్ వైఫల్యం కారణంగా రైలు కోచ్‌లు విడిపోయినట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

