Cool drink: కళ్లు మూసుకుని కూల్‌డ్రింక్‌ తాగుతున్నారా.. అందులో ఏముందో ఒకసారి చూడండి!

|

May 31, 2022 | 9:16 AM

అహ్మదాబాద్‌లోని సైన్స్‌ సిటీ రోడ్డులో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ కస్టమర్‌ కూల్‌డ్రింక్‌లో బల్లి కనిపించడంతో భయాందోళనలు సృష్టించారు. కూల్‌డ్రింక్‌ తాగిన బాధితుడు ఈ విషయాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమాచారం అందించాడు.


అహ్మదాబాద్‌లోని సైన్స్‌ సిటీ రోడ్డులో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ కస్టమర్‌ కూల్‌డ్రింక్‌లో బల్లి కనిపించడంతో భయాందోళనలు సృష్టించారు. కూల్‌డ్రింక్‌ తాగిన బాధితుడు ఈ విషయాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమాచారం అందించాడు. అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మెక్‌డోనాల్డ్స్ ని సీల్‌ చేసింది. వివరాల్లోకి వెళ్తే..ఇద్దరు స్నేహితులు మెక్‌డోనాల్డ్స్‌ లో కూల్‌డ్రింక్‌ తాగుతున్నారు. అయితే వారు తాగుతున్న కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. దెబ్బకు కంగుతిన్న యువకులు విషయం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తెలిపారు. సమచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు కూల్‌ డ్రింక్‌ నమూనాలను సేకరించి తనిఖీల కోసం పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరికి పంపారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న మెక్‌డోనాల్డ్స్‌ కు నోటీసులు జారీ చేశారు. భార్గవ జోషి అనే కస్టమర్ మెక్‌డొనాల్డ్స్ అందించిన కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో AMC అధికారులు చర్యలు తీసుకున్నారు. తదుపరి చర్యలు తీసుకునే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని కూడా ఆదేశించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి లేకుండా మళ్లీ ప్రారంభించరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో జరిగిన ఘటనపై మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. మేము మా కస్టమర్ల భద్రత, పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తాము. అహ్మదా బాద్ అవుట్‌లెట్‌లో జరిగిన సంఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నాము. అయితే, ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందనే దానిపై బాధ్యతగల పౌరులుగా అధికారుల విచారణకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 31, 2022 09:16 AM