Video Viral: గొర్రెపై సరదా సవారీ.. కట్ చేస్తే.. సీన్ కాస్తా రివర్స్ .. ఫన్నీ వీడియో వైరల్!

చాలా మంది ప్రజలు గుమిగూడి ఉండడాన్ని వీడియోలో చూడొచ్చు. చుట్టూ భారీ ఇనుప గేట్లు ఉన్నాయి. ఇంతలో ఒక వ్యక్తి ఇనుప గేటు తెరిచాడు. అతను గేటు తెరవగానే

Video Viral: గొర్రెపై సరదా సవారీ.. కట్ చేస్తే.. సీన్ కాస్తా రివర్స్ .. ఫన్నీ వీడియో వైరల్!
Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Apr 11, 2022 | 8:54 AM

నెట్టింట్లో ప్రతిరోజు ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. నెట్టింట్లో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువ భాగం జంతువులకు సంబంధించినవే ఉంటాయనడంలో సందేహం లేదు. తాజాగా ఓ జంతువు వీడియో వచ్చి చేరింది. గొర్రెలను కూడా మేకలవలె ప్రశాంతమైన జంతువులుగా పరిగణిస్తారు. కానీ, కొన్నిసార్లు అవి తమ కోపోద్రిక్త రూపాన్ని కూడా ప్రదర్శిస్తుంటాయి. అయితే, ఇప్పటి వరకు మీరు గుర్రాలు, ఏనుగులు మొదలైనవాటిని స్వారీ చేసేవారిని చూసి ఉంటారు. అయితే, గొర్రెలను స్వారీ చేయడం ఎప్పుడైనా చూశారా? అవును, ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోని చూసి మీరు తెగ నవ్వుకుంటారు. ఈ వీడియోలో ఒక పిల్లవాడు గొర్రె మీద స్వారీ చేస్తూ కనిపించాడు. అది కూడా గొర్రె వీపుపై తలక్రిందులుగా కూర్చున్నట్లు వీడియోలో చూడొచ్చు.

చాలా మంది ప్రజలు గుమిగూడి ఉండడాన్ని వీడియోలో చూడొచ్చు. చుట్టూ భారీ ఇనుప గేట్లు ఉన్నాయి. ఇంతలో ఒక వ్యక్తి ఇనుప గేటు తెరిచాడు. అతను గేటు తెరవగానే, అక్కడ నుంచి పరుగెత్తుతూ ఒక గొర్రె ఖాళీ స్థలం మధ్యలోకి వచ్చినట్లు చూడొచ్చు. అయితే, దానిపై ఓ పిల్లవాడు కూర్చున్నట్లు కూడా వీడియోలో కనిపించింది. ఈ చిన్నారి ఆ గొర్రె వెనుక సవారీ చేస్తున్నాడు. ఖాళీ స్థలంలోకి వచ్చిన గొర్రె.. ఒక్కసారిగా పిల్లవాడిని కిందపడేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ankitrajput5474 అనే IDతో షేర్ చేశారు. దీనికి ఇప్పటివరకు 3.3 మిలియన్లు అంటే 33 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే 1 లక్ష 42 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, నెటిజన్లు ఈ వీడియోను చూసిన తర్వాత ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు.

Also Read: Funny Video: శునకమా మజాకా!.. సింహాలను ఎగిరి ఎగిరి తన్నిన గ్రామ సింహం.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!

Viral Video: దొంగల సూపర్ ట్యాలెంట్.. సెకన్లలో షెట్టర్ లూటీ.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..!