Boy Viral video: వీడి తొందర తగలెయ్య.. ఎం షాక్ గురు..టర్కిష్ ఐస్‌క్రీమ్ విక్రేతకు ఝలక్ ఇచ్చిన బాలుడు..
మీరు ఎప్పుడైనా టర్కిష్ ఐస్‌క్రీమ్ స్టాల్‌కు వెళ్లారా..? అక్కడ ఒక కోన్ ఐస్‌క్రీమ్ కొన్నారా? అయితే మీకు అక్కడ జరిగే సీన్ అంతా తెలిసే ఉంటుంది. ఒకవేళ వెళ్లకపోయినా.. సోషల్ మీడియాలోనైనా చూసే ఉంటారుగా..
మీరు ఎప్పుడైనా టర్కిష్ ఐస్‌క్రీమ్ స్టాల్‌కు వెళ్లారా..? అక్కడ ఒక కోన్ ఐస్‌క్రీమ్ కొన్నారా? అయితే మీకు అక్కడ జరిగే సీన్ అంతా తెలిసే ఉంటుంది. ఒకవేళ వెళ్లకపోయినా.. సోషల్ మీడియాలోనైనా చూసే ఉంటారుగా.. ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి అంత సాధారణంగా దాన్ని మన చేతిలోకి ఇవ్వడు. అది మన చేతికి, నోటికి అందడానికి ముందు కొన్ని ట్విస్ట్‌లు, టర్న్‌లు, ట్రిక్స్ ప్లే చేస్తారు. గమ్మత్తైన ఆట తర్వాత చివరకు రుచికరమైన ఐస్ క్రీమ్ మన చేతికి వస్తుంది. అయితే ఓ బాలుడు టర్కిష్ ఐస్‌క్రీమ్ విక్రేతకు ఝలక్ ఇచ్చాడు. చిన్నోడిచ్చిన రివర్స్ పంచ్‌కు అతడి మైండ్ బ్లాంక్ అయ్యింది. నెటిజన్లు అయితే పిల్లోడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. వీడియోలో టర్కిష్ ఐస్‌క్రీం అమ్మేవారి స్టాల్ ముందు ఓ బాలుడు నిలబడి ఉన్నాడు. ఐస్ క్రీమ్ కొనేందుకు అక్కడికి వచ్చిన బాలుడ్ని విక్రేత బోల్తా కొట్టించడానికి ట్రై చేశాడు. కానీ బాలుడు అతని చేతిలోని.. స్టిక్‌ని లాగేసుకుని.. కోన్ ఐస్ క్రీమ్ తన చేతబట్టి.. తింటూ అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos