ఏడాదిన్నరగా పోలీసులకు చిక్కని స్మగ్లర్.. కుంభమేళాలో బుక్కయ్యాడు.. ఎలా అంటే..

Updated on: Jan 28, 2025 | 5:00 PM

ఓ కరడుగట్టిన మద్యం స్మగ్లర్‌ తన పాపాలను కడిగేసుకోవడానికి పుణ్యస్నానం ఆచరించాడు. కానీ పాపం టైమ్‌ బాగోలేక పోలీసులకు చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుండి పర్యాటకులు వచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

భారీ జనసమూహంతో కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో ఆసక్తికర ఘటనలు కూడా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా పరారీలో వున్న ఒక నేరస్తుడు పుణ్యస్నానం ఆచరిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. మహా కుంభమేళాలో పర్యాటకులు, భక్తులు స్నానమాచరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మద్యం స్మగ్లర్ కూడా పుణ్యస్నానం చేసేందుకు సంగమతీరానికి చేరుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు సంగమస్థలిలో మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని భదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు తెలియజేశారు. మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నివాసి అని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు. ప్రవేశ్ యాదవ్ ఒకటిన్నర సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని అన్నారు. 2023, జూలై 29న జాతీయ రహదారి-19పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రవేశ్‌ యాదవ్, రాజ్ దోమోలియాలను పోలీసులు అరెస్టు చేసినట్లు అభిమన్యు అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Saif Ali Khan: సైఫ్‌’ కేసులో అరెస్టుతో.. నా జీవితం నాశనం !!

Manchu Lakshmi: వాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించారు మంచు లక్ష్మి పోస్టులు వైరల్‌

Budget 2025: బడ్జెట్‌లో ఈ పదాలకు అర్థాలు తెలుసా ??

Budget 2025: బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది ??

Saif Ali Khan: సైఫ్‌ పై దాడి సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారా ?? మనుషుల తీరుపై హీరోయిన్ సీరియస్