Viral Video: గుండెల్లో దమ్ముంటే.. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనాసరే బలాదూరే
గుండెల్లో దమ్ముంటే.. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనాసరే బలాదూరే!. ఎదురుగా ఉన్నది ఎంత గొప్ప గొప్పోడైనా డోంట్‌కేరే!. మన ఏరియా, మన టెరిటరీలోకి వస్తే ఎవర్నీ లెక్కచేయం!. గుజరాత్‌లో అదే చేశాయ్ శునకాలు!
ఎదురుగా ఉన్నది అడవికి సింహాలు.. అది కూడా ఒక్కటి కాదు.. రెండు సింహాలు యుద్ధానికి వచ్చాయ్. కానీ, ఆ శునకాలు అదరలేదు, బెదరలేదు.. సై అంటే సై అంటే సింహాలపైకి దుమికాయ్. మా ఏరియాలోకొచ్చి మాపైనే దౌర్జన్యమా అంటూ సింహాలపైకి దూసుకొచ్చాయి కుక్కలు.
గుజరాత్‌లోని అమ్రేలి ప్రాంతంలో జరిగిందీ ఇన్సిడెంట్. గ్రామంలోకి ప్రవేశించిన రెండు సింహాలు.. కుక్కలు ఉండే ప్రాంతానికి వచ్చాయ్. సింహాలను గమనించిన శునకాలు.. వాటిపైకి యుద్ధానికి దిగాయ్. ఇక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేదంటే చంపేస్తామ్ అన్నట్టుగా సింహాలపైకి దూసుకొస్తూ వార్నింగ్ ఇచ్చాయ్. సింహాలు, శునకాల మధ్య ఫైటింగ్ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాంతో, ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయ్.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..