మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఇటీవల ఇండియా పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని వంతారాను సందర్శించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మెస్సీకి దాదాపు రూ. 10.91 కోట్ల విలువైన అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లె వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రపంచంలో కేవలం 12 మాత్రమే ఉన్న ఈ వాచ్‌తో పాటు, అనంత్ అంబానీ సొంత వాచ్‌పై కూడా చర్చ జరుగుతోంది. ఈ ఖరీదైన గిఫ్ట్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి ఇండియాలో పలు నగరాలు తిరుగుతూ సందడి చేస్తున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం అయిన వంతారాను విజిట్ చేశారు. అక్కడ జంతువులతో మెస్సి సరదాగా సమయాన్ని గడిపారు. వంతారాను విజిట్ చేసిన మెస్సికి అనంత్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన గుర్తుగా రిచర్డ్ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్ స్టార్‌కు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. వంతారా సందర్శనకు వెళ్లేటప్పుడు మెస్సి చేతికి ఎలాంటి వాచ్ లేదట. అనంత్‌తో మీటింగ్ తర్వాత అతడి చేతిపై ఓ అరుదైన, అత్యంత ఖరీదైన గడియారం దర్శనమిచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వాచ్ రిచర్డ్ మిల్లె బ్రాండ్‌కు చెందిన RM 003-V2 GMT టూర్‌బిల్లాన్ ఆసియా ఎడిషన్. ఇలాంటివి ప్రపంచంలో కేవలం 12 పీస్‌లు మాత్రమే ఉన్నాయట. దీని ధర దాదాపు 1.2 మిలియన్ డాలర్లుగా ఉండోచ్చని తెలుస్తోంది. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 10.91 కోట్లు అన్నమాట. ఈ గడియారాన్ని అనంత్ అంబానీ మెస్సికి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఇక అనంత్ అంబానీ సైతం ఇలాంటి మరోవాచ్‌ను ధరించడం విశేషం. రిచర్డ్ మిల్లె RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్ అనంత్ చేతికి కనిపించింది. దీని విలువ దాదాపు 5 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. అంటే రూ.45.59 కోట్లన్నమాట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీ20 వరల్డ్‌కప్-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్
బయట కాలుష్యం.. కడుపులో బిడ్డకు ప్రమాదమా..?