పోలీస్‌ స్టేషన్‌కు అనుకోని అతిథి.. వీడియో

Updated on: May 03, 2025 | 3:41 PM

జనాలు అడవులు నరికి కాంక్రీట్‌ వనాలుగా మర్చేయడంతో అడవి జంతువులు ఆవాసాలు కోల్పోతున్నాయి. ఈ క్రమంలో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటికోసం వెతుక్కుంటూ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులోని నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అడవుల్లో ఉండాల్సిన ఓ పులి పోలీస్‌స్టేషన్‌లో ఎంట్రీ ఇచ్చింది. పులిని చూసి భయాందోళనకు గురైన పోలీసులు దెబ్బకు స్టేషన్‌ను వదిలి బయటకు పరుగులు తీశారు. తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లోకి ఏప్రిల్ 28, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఓ చిరుతపులి ప్రవేశించింది. మెళ్లగా పీఎస్‌ లోపలికి వచ్చి ఇన్స్పెక్టర్ గది చుట్టూ తిరిగింది. ఆ గదిలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూసింది. అ

దే సమయంలో, మరొక గదిలో విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి ఇన్‌స్పెక్టర్‌ గదిలో చిరుతపులి తిరగడం చూసి షాక్ అయ్యాడు. భయంతో శబ్దం చేయకుండా మౌనంగా అక్కడే నిలబడిపోయాడు. గది మొత్తం తిరిగి చూసి తినడానికి ఏమీ లేకపోవడంతో, చిరుతపులి తిరిగి మెట్లు దిగి, వచ్చిన దారినే వెళ్లిపోయింది. పులి వెళ్లిపోవడంతో హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నాడు పోలీసు అధికారి. వెంటనే స్టేషన్‌కు తాళం వేశాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే చిరుత పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు బయట ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పీఎస్‌లోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు. జంతువులు తరచుగా నగరంలోకి రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అటవీ శాఖ మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పోలిస్ స్టేషన్, చిరుత పులి, వైరల్ వీడియో