పెద్ద పులికి ఎలుగుబంటి ఝలక్.. వీడియోకి నెటిజన్స్ ఫిదా వీడియో
ఎలుగుబంటి పులినే పరుగులు పెట్టించింది. చూడ్డానికి హాస్యాస్పదంగా ఉన్న ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్క్‌లో జరిగింది. వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో ఒక పెద్ద నల్ల ఎలుగుబంటి గర్జించే పులిని భయపెట్టింది. ఎలుగుబంటి ధైర్యానికి, పోరాట స్ఫూర్తికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియోలో ఒక ఎలుగుబంటి నిర్భయంగా పులిని ఎదుర్కొంది. ఇది పెద్దపులిని పారిపోయేలా చేసింది.
సాధారణంగా అడవిలో పులులు సింహాల తర్వాత శక్తివంతమైనవిగా భావిస్తారు. అలాంటిది పులినే ఎలుగుబంటి పరుగులు పెట్టిండం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎలుగుబంటి ఒక చెరువు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక పులి అక్కడికి వచ్చింది. పులి దగ్గరికి రావడాన్ని ఎలుగుబంటి చూసింది. ఆ సమయంలో ఎలుగుబంటి భయపడకుండా పులి ముందు ధైర్యంగా నిలబడింది. పులి మరింత దగ్గరికి రాబోతుండగా ఎలుగుబంటి రెండు సార్లు బలంగా తన శరీరాన్ని కదిలించింది. దీంతో పులి భయపడుతున్నట్లు కనిపించింది. అప్పుడు ఎలుగుబంటి మరింత బిగ్గరగా గర్జించింది. ఇది చూసిన పులి నెమ్మదిగా వెనక్కి తగ్గి చివరికి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో పట్ల నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఎలుగుబంటి దూకుడు, దాని ఆత్మవిశ్వాసమే దానికి గొప్ప ఆయుధాలుగా మారాయని పోస్టులు పెడుతున్నారు. ఎలుగుబంటి ధైర్యం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

