Hyderabad: హైదరాబాద్‌లోకి చిరుతొచ్చిందా..? సీసీ కెమెరాలో కనిపించిన చిరుత.
చిరుతలు అడవులు విడిచి కాంక్రీట్ జంగళ్ళలోకి అడుగుపెడుతున్నాయి. మొన్నటి వరకు అటవీ ప్రాంతాల శివార్లలో కనిపించి భయపెట్టిన చిరుతలు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోకి ఎంట్రీ ఇచ్చాయి. నగర శివార్లలో కనిపించి.. స్థానికులను గజగజా వణికిస్తున్నాయి.హైదరాబాద్ శివారు ప్రాంతంలో వనస్థలిపురంలో చిరుతపులి కదలికలు కనిపించినట్టు స్థానికులు చెప్తున్నారు.
చిరుతలు అడవులు విడిచి కాంక్రీట్ జంగళ్ళలోకి అడుగుపెడుతున్నాయి. మొన్నటి వరకు అటవీ ప్రాంతాల శివార్లలో కనిపించి భయపెట్టిన చిరుతలు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోకి ఎంట్రీ ఇచ్చాయి. నగర శివార్లలో కనిపించి.. స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వనస్థలిపురంలో చిరుతపులి కదలికలు కనిపించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ వార్తలు కాస్త బయటకు రావటంతో.. నగరవాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే.. స్థానికులు ఈ సమాచారాన్ని వెంటనే ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన.. చిరుత కనిపించిందన్న పరిసర ప్రాంతాలకు వెళ్లి.. పరిశీలించారు. అయితే వారికి ఎక్కడ చిరుత పులి ఆనవాళ్ల కనిపించలేదు. అయితే.. చిరుత 24 గంటల్లో సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదని.. ఈ లెక్కన చూసుకుంటే ఇబ్రహీంపట్నం అడవి వరకు వెళ్లే ఛాన్స్ ఉందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దీంతో.. ఇబ్రహీంపట్నం అటవీ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...