పంటపొలాల్లో వింత జంతువు పరుగులు.. భయం భయంగా రైతులు

Updated on: Mar 12, 2025 | 4:33 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొద్దిరోజుల నుండి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి భయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పొలాల్లో వింతజంతువు సంచరిస్తూ అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించింది. దానిని చూసి హడలెత్తిపోయిన రైతులు, కూలీలు అక్కడినుంచి పరుగులు పెట్టారు.

ఓ మహిళ ధైర్యం చేసి ఆ వింత జంతువును తన సెల్ ఫోన్లో చిత్రీకరించి, ఊరంతా వైరల్ చేసింది. అది చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఆ వింత జంతువును గుర్తించారు. పెద్దపులి ఆకారంతో పొలాల మధ్య సంచరిస్తున్న ఈ జంతువును చూసి స్థానికులు మొదట పెద్దపులిగా భావించారు. సంధ్య అనే ఒక మహిళ తన సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వైరల్ చేసింది. గ్రామ శివారులో పులి సంచరిస్తుందని వైరల్ చేయడంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోయారు. పొలాలకు వెళ్లాలంటేనే భయపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆ వింత జంతువు పాదముద్రలు సేకరించారు. వాటిని పరిశీలించిన అటవీ సిబ్బంది అవి పులి పాదముద్రలు కావని, అడవి పిల్లి పాదముద్రలుగా గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తీగ లాగితే.. ఢిల్లీ డొంక కదులుతోంది! హీరోయిన్ కాదు.. గోల్డ్ ఖిలేడీ!

SSMB29 షూటింగ్ నుంచి వీడియో లీక్.. జక్కన్న సీరియస్

చిరంజీవి, పవన్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?