Leopard on Train: రైలు ఇంజిన్‌పై చిరుత..! ఏం జరిగిందా అని చూస్తే షాకింగ్.. వీడియో వైరల్.
మహారాష్ట్ర లో గూడ్స్ రైలు రైల్వే సైడింగ్ దగ్గర ఆగింది. రైలు ఇంజిన్‌పై ఓ చిరుత పడుకుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు. అందరిలో వణుకు. దగ్గరి కెళ్లేందుకు
మహారాష్ట్ర లో గూడ్స్ రైలు రైల్వే సైడింగ్ దగ్గర ఆగింది. రైలు ఇంజిన్‌పై ఓ చిరుత పడుకుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు. అందరిలో వణుకు. దగ్గరి కెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. చేసేదేమీలేక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు కూడా భయం భయంగా వెళ్లి చూసి ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు.చంద్రపూర్ జిల్లాలో వనీ బొగ్గు గని క్షేత్రంలో రైలు ఇంజిన్‌పై చిరుత దర్శనమిచ్చింది. కానీ ఎవరూ దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. దీంతో అటవీశాఖ అధికారులకు రైల్వే అధికారులు సమాచారం అందజేశారు. ఫారెస్ట్ అధికారులు దగ్గరకు వెళ్లి చూస్తే.. రైలు ఇంజిన్‌పై చిరుత అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించారు. తట్టిలేపినా కదలకపోవడంతో చనిపోయినట్లు నిర్ధారించారు. హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలి ప్రాణం కోల్పోయి ఉంటుందని అధికారులు భావించారు. అనంతరం చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం చంద్రపూర్‌కు తరలించారు.చంద్రాపూర్ మెగా థర్మల్ పవర్ స్టేషన్ తడోబా అడవిని ఆనుకొని ఉంటుంది. పైగా అక్కడ పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అనేక ఇతర అడవి జంతువులు నివసిస్తూ ఉంటాయి. రైలు వచ్చే క్రమంలో చిరుత ఇంజిన్ పైకి దూకి ఉంటుందని.. ఆ క్రమంలో హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి చిరుత ప్రాణాలు విడిచి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!