Rare Bird: ఈ పిట్టకు సిగ్గెక్కువ..! నారాయణపేటలో ‘నవరంగ్’ అరుదైన వలస పక్షి..!
అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్‌పూర్ అర్బన్‌పార్క్‌లో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పక్షిని ‘ఇండియన్ పిట్ట’గా పిలుస్తుంటారు. చాలా రంగులతో అందంగా ఉంటుంది.
అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్‌పూర్ అర్బన్‌పార్క్‌లో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పక్షిని ‘ఇండియన్ పిట్ట’గా పిలుస్తుంటారు. చాలా రంగులతో అందంగా ఉంటుంది. రాలిపోయిన ఆకుల కింద ఉండే కీటకాలను తింటూ మనుగడ కొనసాగిస్తుంది. ఇది చాలా సిగ్గరి. ఉదయం, సాయంత్రం ఆక్టివ్‌గా ఉంటూ వినసొంపుగా ఉండే.. ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని చేస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మదన్ రెడ్డి ఈ పక్షిని అతి కష్టం మీద తన కెమెరాలో బంధించారు. ఈ పక్షి హిమాలయ అడవుల్లో.. మధ్య, పశ్చిమ భారతదేశంలోని కొండల్లో ఆకురాల్చే, దట్టమైన అడవుల్లో నివాసం ఉంటుంది. శీతాకాలంలో దక్షిణభారతంలోని దట్టమైన అరణ్యాలకు వలస వస్తుంటుంది. ఈ పక్షి రంగురంగులుగా ఉండడం వల్ల దీన్ని హిందీలో ‘నవరంగ్’ అని పిలుస్తారు. నారాయణపేటలో అరుదైన పక్షి కనిపించడం ఆశ్చర్యాన్నిఉందని ఈ పక్షి ఇక్కడ కనిపించడం నారాయణపేట అడవుల అభివృద్ధి కి నిదర్శనమని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నారాయణపేటలో ఇంకా చాలా పక్షి జాతులు, వన్య ప్రాణులు ఉన్నాయన్నారు. వాటిని అన్వేషించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్లాస్పూర్ అర్బన్ పార్క్‌ను అభివృద్ధి చేయడంతో పాటు పక్షులకు అణువుగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే కాలంలో నారాయణపేటలోని వివిధ పాఠశాలల్లో బర్డ్ వాచింగ్, అడవులు, వన్య ప్రాణుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!