Hippopotamus - Lions: వామ్మో..! సింహాలను ముప్పుతిప్పలు పెట్టి చుక్కలు చూపించింన హిప్పో..

Hippopotamus – Lions: వామ్మో..! సింహాలను ముప్పుతిప్పలు పెట్టి చుక్కలు చూపించింన హిప్పో..

Anil kumar poka

|

Updated on: Mar 18, 2023 | 6:44 PM

అడ‌వికి రారాజు ఎవ‌రంటే సింహాం అని చెప్పేస్తారు. దాదాపుగా సింహాలంటే మిగతా జంతువులు చాలా భయపడుతుంటాయి. అది ఎక్కడ దాడి చేసి చంపుతుందోనని ఆందోళన చెందుతుంటాయి.

అడ‌వికి రారాజు ఎవ‌రంటే సింహాం అని చెప్పేస్తారు. దాదాపుగా సింహాలంటే మిగతా జంతువులు చాలా భయపడుతుంటాయి. అది ఎక్కడ దాడి చేసి చంపుతుందోనని ఆందోళన చెందుతుంటాయి. అలాంటిది.. ఒక నీటి ఏనుగు సింహాలకే చుక్కలు చూపించింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సింహాలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ హిప్పోపొటమస్‌ దెబ్బకు సింహాలు మూడు బతుకు జీవుడా అన్నట్టుగా తలోదిక్కు తప్పించుకుని పారిపోయాయి. ఓ చెరువులో హిప్పోపొట‌మ‌స్‌లు సేద‌తీరుతున్నాయి. ఇంతలో నీళ్లు తాగేందుకు మూడు సింహాలు ఆ చెరువు వ‌ద్దకు చేరాయి. హిప్పోపొట‌మ‌స్‌ను చూసిన సింహాం న‌క్కిన‌క్కి నీళ్లు తాగేందుకు ప్రయ‌త్నించింది. సింహాం బ‌ల‌హీన‌త‌ను ప‌సిగ‌ట్టిన నీటి ఏనుగు.. దానిపై దాడి చేసేందుకు ముందుకు దూకుంది. అంతే ఇంకేముంది అక్కడ్నుంచి ఆ సింహాంతో పాటు మ‌రో రెండు కూడా ప‌రార్ అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ద‌క్షిణాఫ్రికాలోని క‌పామా ప్రయివేటు గేమ్ రిజ‌ర్వ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పాతదే అయినప్పటికీ మరోసారి ట్రెండింగ్‌లో వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 18, 2023 06:44 PM