Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..?  సాయం చేయబోతే షాక్‌..! వీడియో

Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..? సాయం చేయబోతే షాక్‌..! వీడియో

Phani CH

|

Updated on: Oct 21, 2021 | 9:24 AM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. నక్కలపల్లి గ్రామంలో ఓ చిరుత పిల్ల తల చెంబులో ఇరుక్కుపోయింది. బయటకు తీయడానికి నానా తిప్పలు పడుతోంది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. నక్కలపల్లి గ్రామంలో ఓ చిరుత పిల్ల తల చెంబులో ఇరుక్కుపోయింది. బయటకు తీయడానికి నానా తిప్పలు పడుతోంది. అటుగా వెళ్తోన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆ మూగజీవి అవస్థను చూసి చలించిపోయారు.. తన వాహనాన్ని ఆపి దాని వద్దకు వెళ్లారు. తల చెంబులో ఇరుక్కుపోయి పిల్లి ఇబ్బంది పడుతోందని భావించిన కొండా రాఘవరెడ్డి.. దానికి సాయం చేద్దామనుకున్నారు. పిల్లికి సాయం చెద్దామని దగ్గరకు వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకున్నారు. అప్పటికి గానీ అసలు విషయం తెలియలేదు. ఒక్కసారిగా చిరుతపులి పిల్ల కరవడంతో అవాక్కయ్యారు. అది పిల్లి కాదు చిరుతపులి పిల్ల అని అర్థమై కిందకు వదిలేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. ఇంటికింద వందల సంఖ్యలో పాములు.. వీడియో

Viral Video: అబ్బాయిగా మారిన అమ్మాయి.. ఎందుకో తెలిస్తే..! వీడియో

Published on: Oct 21, 2021 09:23 AM