ఈ ప్యాలెస్ ముందు.. అంబానీ ఇల్లు కూడా ఎందుకు పనికిరాదు.. వీడియో

Updated on: May 06, 2025 | 5:26 PM

ఆ రాజభవనాన్ని పూర్తిగా చూసేందుకు ఒక్కరోజు సరిపోదు. అందులోని అద్బుతాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ రెసిడెన్స్గా ఆ ప్యాలెస్ కు పేరుంది. ఇందులోని కట్టడాలు, ఫర్నీచర్, ఫౌంటెయిన్లు ఇలా ప్రతి ఒక్కటీ కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. దాదాపు 700 ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఈ ప్యాలెస్‌ ఎక్కడుంది..? దాని చరిత్ర ఏంటి..?దేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నివాసం ఏదంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం ముఖేష్‌ అంబానీ యాంటీలియా. కానీ అది తప్పు.

 యాంటిలియా కన్నా అతిపెద్ద ప్రైవేట్‌ నివాసం ఒకటి ఉంది. వందల ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనమే లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఈ రాజభవనం బ్రిటిష్‌ రాజకుటుంబం నివసించే బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ కన్నా నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది. లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ను చూడాలంటే రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. 700 ఎకరాల విస్తీర్ణం.. కళ్లు చెదిరే నిర్మాణం. అప్పట్లో 27 లక్షలు ఖర్చు చేస్తే.. 12 ఏళ్లకు నిర్మాణం పూర్తైంది. 1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. రాజభవన నిర్మాణానికి చీఫ్ ఆర్కిటెక్ట్ గా మేజర్ చార్లెస్ మాంట్ పని చేశారు. అద్భుతమైన ఈ రాజమందిరాన్ని ఇండో-సారసెనిక్‌ శైలిలో నిర్మించారు. ప్రపంచంలోనే ఇలాంటి కట్టడం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. గుజరాత్ వడోదరలో ఉంది ఈ లక్ష్మీ విలాస్ రాయల్ ప్యాలెస్. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రాజసౌధం అతిపెద్ద ప్రైవేట్ ప్యాలెస్గా గుర్తింపు పొందింది.
మరిన్ని వీడియోల కోసం :
వాడు నావాడంటే.. నావాడు అంటూ ఓ సీఐ కోసం పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న మహిళలు
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే.. అగ్ని ప్రమాదం సంభవిస్తుందా వీడియో
అడిగినంత పనీర్ వడ్డించలేదని పెళ్లి మండపంలో దారుణం వీడియో
Published on: May 06, 2025 05:13 PM