Lady Teacher: ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్.. కట్ చేస్తే సీన్ సితారనే.. ప్రత్యక్ష వీడియో..

Updated on: Sep 14, 2022 | 10:03 AM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారే గతితప్పి ప్రవర్తిస్తున్నారు. దేవాలయం లాంటి పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు..


పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారే గతితప్పి ప్రవర్తిస్తున్నారు. దేవాలయం లాంటి పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు.. ఫుల్లుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చింది. అధికారులు పరిశీలనకు రాగా అడ్డంగా బుక్కయింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని తమకూరు తాలూకాలోని చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో 25 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తన్న గంగలక్ష్మమ్మ మద్యానికి బానిస అయింది. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు రావడంతోపాటు.. విద్యార్థులను కొట్టడం, సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగటం చేస్తుంది. దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పద్దతి మార్చుకోవాలంటూ గంగలక్ష్మమ్మకు సూచించారు. అయినా ఆమె వినకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసి నిరసనకు దిగారు.

ఈ క్రమంలో పరిశీలనకోసం పాఠశాలకు వచ్చిన విద్యాధికారి బీఇవో హనుమానాయక్‌, పోలీసులతో కూడా గంగలక్ష్మమ్మ వాదనకు దిగింది. ఆమె ఉదయాన్నే మద్యం తాగి.. క్లాసులు బోధిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఉపాధ్యాయిని టేబుల్‌డ్రాలో ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు కనిపించాయి. దీంతో పోలీసులు, అధికారులు అవాక్కయ్యారు. ఈ క్రమంలో గంగలక్ష్మమ్మ తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకొంటానంటూ అధికారులను బెదిరిస్తూ హంగామా సృష్టించింది. అనంతరం పోలీసులు ఆమెను సముదాయించి బయటకు తీసుకొచ్చారు. అక్కడినుంచి ఆమెను బీఈవో వాహనంలో తరలించారు. అనంతరం పోలీసులు మద్యం సీసాలను జప్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 14, 2022 09:59 AM