ఆగిపోయిన గుండెను.. 5 నిమిషాల్లో కొట్టుకునేలా చేసింది
ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవత్వం పరిమళించింది. ప్రాణాపాయంలో ఉన్న వృద్ధుడిని చూసి అక్కడే ఉన్న ఓ వైద్యురాలు తక్షణమే స్పందించారు. వృత్తి ధర్మాన్ని పాటించి ఆయనకు ఆయువు పోశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు రెండో టర్మినల్ వద్ద బుధవారం 60ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు గుండెపోటుకు గురయ్యారు. ఫుడ్‌కోర్టు ఏరియా వద్ద ఉన్నట్టుండి కుప్పకూలారు.
ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవత్వం పరిమళించింది. ప్రాణాపాయంలో ఉన్న వృద్ధుడిని చూసి అక్కడే ఉన్న ఓ వైద్యురాలు తక్షణమే స్పందించారు. వృత్తి ధర్మాన్ని పాటించి ఆయనకు ఆయువు పోశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు రెండో టర్మినల్ వద్ద బుధవారం 60ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు గుండెపోటుకు గురయ్యారు. ఫుడ్‌కోర్టు ఏరియా వద్ద ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా డాక్టర్ వేగంగా స్పందించారు. ఆ వ్యక్తి ఛాతీపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ చేశారు. ఆమె కృషి ఫలించి సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు స్పృహలోకి వచ్చారు. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ కాగా.. వైద్యురాలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె వివరాలేమీ తెలియరానప్పటికీ హీరో డాక్టర్ అంటూ కొనియాడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..
దారుణం.. ముక్కుపచ్చలారని చిన్నారిపై..
బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్
నదిని ఈదిన పారిస్ మేయర్.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నడీ సముద్రంలో బోటుకు రంధ్రం.. ఎలా బయటపడ్డారో తెలుసా ??