ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం ??

Edited By: Phani CH

Updated on: Nov 28, 2025 | 7:47 PM

కర్నూలు జిల్లా నారాయణపురంలో కార్తీక మాసం అనంతరం శ్రీ గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్థులంతా కుల మత బేధాలు లేకుండా ఆలయంలో సహపంక్తి భోజనం చేస్తారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం వల్ల గ్రామానికి ఎలాంటి సమస్యలు రావని, సుభిక్షంగా ఉంటుందని వారి నమ్మకం. ఈ సంప్రదాయం ఐకమత్యానికి ప్రతీక.

కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఓ ఆచారం కొనసాగుతోంది. కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే సోమవారం ఆ గ్రామస్థులంతా స్థానిక ఆలయానికి చేరుకొని పూజలు చేస్తారు. అనంతరం సహపంక్తి భోజనాలను దేవాలయ ఆవరణంలోనే కుల మతాలకు అతీతంగా భోజనాన్ని ఆరగిస్తారు. దీనివల్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు దరిచేరవని వారి నమ్మకం. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలని కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామస్థులంతా శ్రీ గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి సహపంక్తి భోజనం చేశారు. వందల సంత్సరాల నుంచి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏడాది కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే సోమవారం గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. అనంతరం ప్రతి ఇంటిలో ఒక రోజుకు ఎంత వంట చేస్తారో అంత వంట వండి అత్యంత నిష్టతో అన్నం తెచ్చి దేవాలయంలో రాసిగా పోస్తారు. సాంబారు మాత్రమే గుడిలోనే వండుతామని తెలిపారు. పూజలు తరువాత కుల, మత బేధాలు లేకుండా… సామూహిక భోజనం చేస్తామని వారు తెలిపారు. ప్రతి ఏడాది ఇలా పూజలు చేయడం వల్ల గ్రామంలో కరవు, కాటకాలు రావని దేవాలయ కమిటీ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: స్పిరిట్ లో చిరు.. పక్కా సమాచారం..?

Kaantha OTT: అప్పుడే OTTలోకి కాంతా మూవీ

ఎటు చూసినా నీళ్లే.. శ్రీలంకను ముంచిన వరుణుడు

చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం

Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది