కలుపు తీద్దామని పొలానికి వెళ్తే.. లక్ష్మీ దేవి తలుపు తట్టింది

Updated on: Aug 24, 2025 | 8:20 AM

కష్టే ఫలి అంటారు పెద్దలు. కష్టానికి తగిన ఫలితం ఎప్పటికైనా దొరుకుతుంది అని.. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రెండు నెలలుగా కర్నూలు జిల్లాలో వేలాది మంది స్థానికులు వజ్రాల అన్వేషణలో మునిగిపోగా, ఓ మహిళా రైతు కూలీ మాత్రం ఎప్పటిలాగే తనకున్న కొద్దిపాటి పొలంలో కలుపు తీయటానికి వెళ్లింది. అలా పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళా కూలీకి ఓ వజ్రం దొరికింది.

అది భారీ ధరకు అమ్ముడు పోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ మహిళ పచ్చి మిర్చి పొలంలో కలుపు తీస్తుండగా మెరుస్తూ ఏదో రాయి కనిపించింది. అనుమానం వచ్చిన మహిళ ఆ రాయిని తీసుకొని వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లింది. ఆమె అనుమానం నిజమైంది. ఆ మహిళ తెచ్చిన రాయిని వజ్రంగా గుర్తించిన స్థానిక వజ్రాల వ్యాపారి 40 లక్షలు నగదు ఇచ్చి కొనుగోలు చేశాడు. అయితే బహిరంగం మార్కెట్లో ఈ వజ్రం విలువ ఇంకా ఖరీదైనదిగా తెలుస్తుంది. గతంలో ఇదే గ్రామానికి చెందిన మహిళకు కోటి 20 లక్షల విలువైన వజ్రం దొరికింది. తాజాగా, ఈ మహిళకు 40 లక్షల వజ్రం దొరకడంతో గ్రామంలో వజ్రాల అన్వేషణ మరింత జోరుగా సాగుతోంది. ఎక్కువగా.. కలుపు తీసే మహిళా రైతులకు వజ్రాలు దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపుగా 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నేలలోని వజ్రాలు బయటకు వస్తున్నాయని వారు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బన్నీకే మొదటి ప్రాధాన్యత దీపిక నిర్ణయంతో.. బాలీవుడ్‌ మేకర్స్‌ షాక్‌

పాపం! ఆ సినిమా కూడా చేసుంటే.. ఈ బేబీ ఎక్కడికో వెళ్లిపోయేదిగా..

ఈ అరవ ప్రేమకథ ఎలా ఉంది? హిట్టా..? ఫట్టా..?