ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ముక్కామల కళాకారులు
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్కామల కళాకారుల బృందం తమ అద్భుత ప్రదర్శనతో యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించింది. అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం ఈ ఘనత సాధించింది.
దేశ నలుమూలల నుంచి ఎంపికైన దాదాపు 220 మంది కళాకారులతో నిర్వహించిన హెరాల్డింగ్ ప్రోగ్రామ్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున పసుపులేటి కుమార్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారుల బృందం పాల్గొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ బృందం చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత సంస్కృతి మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాదస్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్లతో కళాకారులు సంప్రదాయ సంగీతానికి ప్రాణం పోశారు. ప్రేక్షకులతో పాటు ప్రముఖులను కూడా ఈ ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. కాగా, ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం వరుసగా ఈ ఏడాదితో నాలుగోసారి ప్రదర్శన ఇవ్వడం కోనసీమ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ముక్కామల కళాకారులు
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!

