ట్రైన్‌లో సీటు దొరకలేదని ఆ మహిళ ఏం చేసిందో చూడండి

Updated on: Oct 14, 2025 | 8:34 PM

బస్సులో, ట్రైన్‌లో సీట్లకోసం జుట్టుపట్టుకొని కొట్టుకున్న ఘటనలు చూశాం. తాజాగా ఓ మహిళ మరో అడుగు ముందుకేసి తనకు సీటు ఇవ్వకపోతే అందరి కళ్లలో కారం కొడతానని బెదిరించింది. దాంతో ఓ ప్రయాణికురాలు ఆగ్రహంతో ఆ మహిళను అడ్డుకోగా ఆమె మరింత రెచ్చిపోయింది. ప్రయాణికులపై పెప్పర్‌ స్ప్రే చల్లేందుకు ప్రయత్నించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. సీల్దా స్టేషన్‌లో లోకల్‌ ట్రైన్‌ ఎక్కింది ఓ మహిళ. అయితే ఆమెకు ట్రైన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో సీటు దొరకలేదు. దాంతో ఆ మహిళ తీవ్ర అసహనానికి గురయింది. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచెయ్యాలనుకుంది. అంతే ఈన బ్యాగులోనుంచి పెప్పర్‌ స్ప్రే తీసి ప్రయాణికుల ముఖంపై చల్లేందుకు ప్రయత్నించింది. ఓ మహిళ జోక్యం చేసుకొని ఆమెను ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయిన ఆ మహిళ ఆ కంపార్ట్‌మెంట్ మొత్తం పెప్పర్‌ స్ప్రే చల్లింది. దీంతో కారం ఘాటుకు కొందరు ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇదంతా చూసి మిగతా ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు. ఆ మహిళను గట్టిగా నిలదీశారు. దాంతో దిగొచ్చిన మహిళ వారికి క్షమాపణ చెప్పింది. అనంతరం రైల్వే పోలీసులకు ఆమెను అప్పగించారు. కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్లలో ఈ ఘటనను రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ తీరుపై మండిపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రతికుండగానే తన అంత్యక్రియలు చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత

2026లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతో తెలుసా ??

Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్‌ వాటర్ మెట్రోను చూశారా

సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా

నీ ఫిట్‌నెస్ సూపర్‌ బ్రో… సైకిల్‌పై ఈఫిల్‌ టవర్‌ ఎక్కాడు