Wedding: వామ్మో! పెళ్లి కోసం మనవాళ్లు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా.!
పెళ్ళంటే సంబరమే అయినా ముందుగా మన మైండ్ లోకి వచ్చేది మాత్రం ఖర్చే. డబ్బున్నా లేకున్నా..లైఫ్ లో ఒక్కసారే కదా పెళ్ళి చేసుకునేది అన్న మైండ్ సెట్ లోనే ఉంటారు చాలామంది. అంతెందుకు మన చుట్టూ మనం చూసింది, చేసింది అలాంటి పెళ్ళిళ్ళే ఎక్కువ. అప్పట్లో కాని, ఇప్పట్లో కాని, భవిష్యత్తులో కాని పెళ్ళి ఖర్చు పెరుగుతుందే తప్ప తగ్గలా లేదు. చదువుతో పోలిస్తే.. భారతీయులు తమ వివాహాలపైనే రెట్టింపు ఖర్చు చేస్తున్నారని ఇటీవలే ఒక నివేదిక కూడా పేర్కొంది.
ఇండియాలో పెళ్లిళ్ల ఖర్చు భారీగా పెరిగింది. ఈ ఏడాది పెళ్లిళ్ల కోసం ఏకంగా రూ.36.5 లక్షల కోట్ల ఖర్చు పెట్టారని ఓ వెడ్డింగ్ కంపెనీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. కిందటేడాది ఇదే టైమ్‌లో జరిపిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ. సగటున ఒక పెళ్లి కోసం రూ.51 లక్షలను ప్రజలు ఖర్చు చేశారు.
వెన్యూ, కేటరింగ్ ఖర్చులు కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం మేర పెరిగాయి. దీంతో పెళ్లిళ్ల కోసం చేసే సగటు ఖర్చు కూడా పెరిగింది. ‘పెళ్లి బాగా జరగాలని అందరూ కోరుకుంటారు. పెళ్లి మండపం కోసమూ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత ఫుడ్ కోసం, ప్లానింగ్ ఏజెన్సీల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో చాలా కుటుంబాలు ఇల్లు కొనడానికి, తమ పిల్లల పెళ్లికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి’ అని ఢిల్లీ బేస్డ్ వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు.
సుమారు 3,500 జంటలను ఓ వెడ్డింగ్ సంస్థ సర్వే చేసింది. దీని ప్రకారం, పెళ్లిళ్ల కోసం రూ.కోటి కంటే ఎక్కువ ఖర్చు చేశామని 9 శాతం మంది పేర్కొన్నారు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఖర్చు చేశామని మరో 9 శాతం మంది తెలిపారు. వీరి వాటా 40 శాతంగా ఉంది. 23 శాతం మంది రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య, 19 శాతం మంది రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఖర్చు చేశారు. మెజార్టీ ప్రజలు పెళ్లి కోసం రూ.15 లక్షల కంటే తక్కువ ఖర్చు చేశారు.
పర్సనల్ సేవింగ్స్, ఫ్యామిలీ సేవింగ్స్‌ను పెళ్లి ఖర్చుల కోసం వాడామని 82 శాతం మంది తెలిపారు. లోన్లు తీసుకున్నామని 12 శాతం మంది, ఆస్తులు అమ్మామని 6 శాతం మంది వివరించారు. నవ దంపతులు.. పెళ్లిలో కొత్త ఎక్స్‌పీరియెన్స్ కోసం ఖర్చు చేయడం పెరిగినట్లు చెబుతున్నారు.
పెళ్లిలో కాక్‌టైల్ మిక్సింగ్, గేమింగ్ సెషన్లు పెట్టడం, వెన్యూ వద్ద టెంపరరీ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం వంటి వాటికి జెన్ జెడ్ కపుల్స్ ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది వెస్ట్రన్ స్టైల్ కాన్సెప్ట్‌లను తమ పెళ్లిలో కోరుకుంటున్నారు. థీమ్డ్ వెల్‌కమ్ డిన్నర్లు ఏర్పాటు చేయడం వంటిని ఈ కేటగిరీ కిందకు వస్తాయి. కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది నవంబర్– డిసెంబర్‌లో సుమారు 48 లక్షల పెళ్లిళ్లు ఉన్నాయి. వీటితో ఏకంగా రూ.6 లక్షల కోట్ల బిజినెస్ ఉంటుందని అంచనా వేస్తోంది.
గత సంవత్సరం, నవంబర్-డిసెంబర్ మధ్య భారతదేశంలో జరిగిన 3.8 మిలియన్ల వివాహాలతో సుమారు రూ. 4.74 ట్రిలియన్లు వచ్చాయి. ఓవరాల్ గా చూస్తే ముఖ్యంగా దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌కు ఉన్న అధిక డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి రిటైల్ రంగం సిద్ధమవుతోంది. సేవల రంగం కూడా బాంకెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీలో పెరిగిన బిజినెస్ ను చూస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.