Hyderabad: ఆ లేడీతో జాగ్రత్త.! లిఫ్ట్‌ అడిగి డబ్బులు డిమాండ్‌.. ఇవ్వకపోతే అత్యాచారం కేసు.

|

Jan 05, 2024 | 5:39 PM

హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లో మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సయాదా నయీమా సుల్తానా అనే మహిళ రోడ్డు మీద వెళ్లే వాహనాలను ఆపి లిఫ్ట్‌ అడిగి వాహనంలో ఎక్కిన తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డావని నీపై కేసు పెడతానని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు, తానొక అడ్వకేట్‌నని, తనకు అన్ని సెక్షన్లు తెలుసునని దబాయించి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను బాధితుడి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లో మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సయాదా నయీమా సుల్తానా అనే మహిళ రోడ్డు మీద వెళ్లే వాహనాలను ఆపి లిఫ్ట్‌ అడిగి వాహనంలో ఎక్కిన తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డావని నీపై కేసు పెడతానని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు, తానొక అడ్వకేట్‌నని, తనకు అన్ని సెక్షన్లు తెలుసునని దబాయించి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను బాధితుడి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా వెళ్తున్న పరమానంద అనే వ్యక్తి కారును ఆపి, కారులో కూర్చున్న తర్వాత అతన్ని డబ్బులు డిమాండ్‌ చేసింది. డ్రైవర్‌ నిరాకరించడంతో తన దుస్తులు చింపుకొని తనపై అత్యాచారం చేసినట్టు కేసుపెడతానని బెదిరింపులకు పాల్పడటంతో ఆయన పోలీసులనుఆశ్రయించాడు. కాగా ఈ కిలాడీ లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు నమోదైనట్టు తేలింది. ఈ కిలాడీ లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు ఉన్నాయని, వాటి ఆధారంగా ఏ కేసుకు ఎలాంటి శిక్ష పడుతుందో చెబుతూ బాధితులనుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కిలాడీ లేడీ ఇప్పటికే అనేకమందిపై ఇలాంటి కేసులు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తోంది ఈ కిలాడీ. పలువురు అమాయకుల మీద ఇలాగే కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.