
Viral Video: చిన్నారుల మనసులు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటాయి. తెలిసీ తెలియక వారు చేసే పనులు పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే కాసేపు వారితో గడిపితే చాలు ఎంతటి బాధనైనా ఇట్టే మరిచిపోతుంటాం. మరీముఖ్యంగా ఈ స్మార్ట్ జనరేషన్‌లో పిల్లలు మరింత షార్ప్ అవుతున్నారు. స్మార్ట్ ఫోన్లను చేతబట్టి అన్ని నేర్చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను చూస్తూ చిన్న ఏజ్‌లోనే నటించేస్తున్నారు. ఇక చిన్నారుల చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ వీడియోనే ఇంటర్‌నెట్‌ను చుట్టేస్తోంది. ఓ చిన్నారి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చేసిన యాక్టింగ్ చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ విషయమేంటంటే ఓ పార్క్‌లో సుమారు మూడేళ్ల వయసున్న చిన్నారి తన చిన్న సైకిల్‌తో ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ వ్యక్తి అక్కడే నేలపై కూర్చొని మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఏటవాలుగా ఉన్న ప్రదేశం కావడంతో చిన్నారి సైకిల్‌ను కంట్రోల్ చేయలేకపోయింది. వేగంగా వచ్చి సైకిల్‌తో సదరు మొబైల్ ఉపయోగిస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా అవతలివైపు పడిపోయాడు. అయితే ఇది గమనించిన ఆ చిన్నారి, ఎక్కడ తనను దండిస్తాడో అన్న భయంతో ఓ చిన్న ఉపయాన్ని ఆలోచింది.
వెంటనే సైకిల్‌ను కిందపడేసి తాను పడిపోయినట్లు యాక్టింగ్ చేసింది. నేలపై పడుకొని రెండు చేతులు చెవి దగ్గరపెట్టుకొని కదలకుండా ఉండిపోయింది. అలా చేస్తే కింద పడ్డ వ్యక్తి ఏమనడు అనేది ఆ చిన్నారి ఉద్దేశమన్నమాట. దీనంతటినీ అక్కడే ఉన్న అతను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి నటనను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదంతా ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. అంత చిన్న వయసులో ఆ చిన్నారి అలా నటించడం మాత్రం నిజంగానే గ్రేట్ కదూ..!
Also Read: Corona 4th Dose: ఇక నాలుగో డోస్ వంతు వచ్చేసింది.. అమెరికా డాక్టర్ ఆంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు..
Hijab – Supreme Court: హిజాబ్ ఇష్యూపై విచారణకు సుప్రీం నో.. సమస్యను జాతీయం చేయొద్దన్న సీజే..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..