చేపల కోసం వల వేసిన జాలరి.. ఆ వలలో చిక్కింది చూసి షాక్
మొంథా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో చెరవులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. పైనుంచి వస్తున్న వరద ఉధృతికి రకరకాల చేపలు కూడా కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన జాలరి వలలో ఓ అరుదైన చేప చిక్కింది.
ఆ భారీ చేపను చూసి ఆశ్చర్యపోయారు మత్స్యకారులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ లో ఓ జాలరి వలకు భారీ చేప చిక్కింది. నాయకన్ గూడెం గ్రామానికి చెందిన మేకల పరశురాములు పాలేరు జలాశయం లో చేపలు వేటాడుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ లాగానే చేపల వేటకు వెళ్లిన పరశురాములు వలలో 20 కేజీల బరువైన ఓ భారీ మీసాల చేప పడింది.ఇలాంటి మీసాల చేపలు జలాశయం లో అరుదుగా లభిస్తాయని పరశురాములు చెప్పాడు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద చేపలు లభించలేదని ఆయన అన్నారు. వీటిని స్థానికులు జెల్లలుగా పిలుస్తారు. మీసాల జెల్ల చేప ధర కేజీ 200 వరకు ఉంటుందని జాలరి తెలిపాడు. ఈ చేప ఏకంగా రూ.4000 రూపాయలకు అమ్ముడుపోయినట్టు జాలరి తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీగా నగలు ధరిస్తే.. రూ. 50 వేలు జరిమానా !
ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా ??
సడెన్‌గా బ్లూ కలర్‌లోకి మారిన వీధికుక్కలు.. ఎక్కడంటే ??
చెట్టెక్కి కొట్టుకున్న సింహం-చిరుత.. తర్వాతి సీన్ చూస్తే నవ్వాగదు
