డిసెంబర్ 1 నుంచి కీలక మార్పులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా.?
నవంబర్ నెల ముగియబోతోంది. డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిసెంబర్ 1, 2024 నుండి భారతదేశంలో అనేక కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. ఇవి సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఈ మార్పులు LPG కనెక్షన్ , ATM కార్డ్ , ఆధార్ అప్‌డేట్ , పెట్రోల్ ధరలు, బీమా, పాన్-ఆధార్ లింకేజీ వంటి విషయాలపై ప్రభావం చూపుతాయి. మరి ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయో తెలుసుకుందాం.
LPG కనెక్షన్ కొత్త నియమాలు: డిసెంబర్ 1, 2024 నుండి LPG సబ్సిడీలో మార్పు ఉండవచ్చు . గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డ్ లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అదనంగా, ప్రతి కనెక్షన్‌కు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయవచ్చు. ATM కార్డ్‌కి సంబంధించిన మార్పుల విషయానికొస్తే ఇకపై మీ పాత మాగ్నెటిక్ స్ట్రిప్ ATM కార్డ్‌లు పనిచేయవు. డిసెంబర్ 1, 2024లోగా చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. మీరు ఇంకా కొత్త కార్డ్ తీసుకోనట్లయితే, వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
డిసెంబర్ 1, 2024 నుండి ఆధార్ అప్‌డేట్ ప్రాసెస్ సులభతరం కానుంది. అలాగే మరింత వేగవంతం అవుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు రివైజ్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని UIDAI నిర్ణయించింది. నకిలీ గుర్తింపులను నిరోధించడానికి, డేటాబేస్‌ను అప్‌డేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద పెట్రోల్ ధర మారవచ్చు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కొత్త సబ్సిడీ పథకాన్ని అమలు చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.